ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీ!

Update: 2019-06-22 05:50 GMT
పాల‌నాప‌ర‌మైన మార్పుల విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాయువేగంతో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రోజుల వ్య‌వ‌ధిలో ఏపీ పాల‌న‌పై త‌న ముద్ర‌ను వేసిన ఆయ‌న‌..నిర్ణ‌యాలు తీసుకోవ‌టం విష‌యంలో అస్స‌లు వెనుకాడ‌టం లేదు. ఎవ‌రి ఒత్తిళ్లు త‌న మీద ప‌ని చేయ‌మ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే త‌న తీరుతో తేల్చేసిన జ‌గ‌న్‌..తాజాగా ఏపీలోని 42మంది మంది ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో అధికారుల ప‌ని తీరు.. వారి వ్య‌వ‌హార‌శైలి ఆధారంగా తాజా ఎంపిక చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకయ్య చౌదరి,గుర్రాల శ్రీనివాస్,పి కోటేశ్వర రావు, సి.నాగరాణి లకు ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వ‌లేదు. వీరిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా బ‌దిలీలు.. ఆయా అధికారుల‌కు కేటాయించిన శాఖ‌ల్ని చూస్తే.. 

జి.సృజన - విశాఖ మున్సిపల్ కార్పొరేష‌న్ కమిషనర్

షాన్మోహన్ - ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్

ఎల్.శివశంకర్ - విశాఖ జాయింట్ కలెక్టర్

లక్ష్మీ షా - తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్

దినేష్ కుమార్ - గుంటూరు జాయింట్ కలెక్టర్

ఎం. గౌతమి - కడప జాయింట్ క‌లెక్ట‌ర్‌

 కె.మాధవి లత - కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్

కె.శ్రీనివాసులు - శ్రీకాకుళం జాయింట్ క‌లెక్ట‌ర్

డి.మార్కండేయులు - చిత్తూరు జాయింట్ క‌లెక్ట‌ర్

పి.ప్రశాంతి - అనంతపురం మున్సిపల్ కమిషనర్

ప్రసన్న వెంకటేష్ - విజయవాడ మున్సిపల్ కమిషనర్

పీఎస్.గిరిషా - తిరుపతి మున్సిపల్ కమిషనర్

ఎం. హరి నారాయణ - ఏపీఐఐసీ ఈడీ

రంజిత్ బాషా - గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్

గంధం చంద్రుడు - ఎస్సీ కార్పొరేషన్ ఎండీ

హిమాన్షు సుఖ్లా - చేనేత శాఖ డైరెక్టర్

వి.చిన వీరభద్రుడు - సర్వ శిక్ష అభియాన్ ఎస్పీడీ

పి.రాజా బాబు - సెర్ప్ సీఈవో

బి.రాజశేఖర్ - పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి

వై.మధుసూదన్ రెడ్డి - మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్

బి.ఉదయలక్ష్మి - కార్మిక,ఉపాధి కల్పన ముఖ్య కార్యదర్శి

కాంతిలాల్ దండే - ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి

శశిభూషన్ కుమార్ - జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి

ఆర్పీ సిసోడియా - జీఏడి ముఖ్యకార్యదర్శి

ముద్దాడ రవిచంద్ర - సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి

ముఖేష్ కుమార్ మీనా - గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి

వాణీమోహన్ - సహకార శాఖ కమిషనర్

భానుప్రకాశ్ - ఖనిజాభివృద్ది సంస్థ ఎండీ

డి.వరప్రసాద్ - కార్మిక శాఖ కమిషనర్

హెచ్.అరుణ్ కుమార్ - వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్

ప్రవీణ్ కుమార్ - ఏపీ ఏపీటీడీసీ

కె.కన్నబాబు - విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్

ఎం. రామారావు - బీసీ కార్పొరేషన్ ఎండీ

కార్తికేయ మిశ్రా - ఆరోగ్య శాఖ డైరెక్టర్

ఎ. మల్లికార్జున - ఆరోగ్యశ్రీ సీఈవో

నాగలక్ష్మి - ఏపీ ఈపీడీసీఎల్ ఎండీ
.
వి.విజయరామరాజు - ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ

కేవీఎన్. చక్రధర బాబు - ఏపీ ట్రాన్స్ కో జేఎండీ

కృతికా సుఖ్లా - స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్


Tags:    

Similar News