ఓవైపు కొవిడ్.. మరో వైపు సంక్షేమ కార్యక్రమాల్ని జోరుగా సాగిస్తున్న ఏపీ సర్కారు.. పాలనా పరమైన అంశాల విషయంలో ఏ మాత్రం తగ్గకపోవటం తెలిసిందే. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నప్పటికీ.. సీఎం జగన్ మాత్రం అర్హులకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఏదైనా విపత్తు చోటు చేసుకున్నప్పుడు.. ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది. మిగిలిన విషయాల్ని లైట్ తీసుకుంటారు.
కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు అందుకు భిన్నంగా ఉందని చెప్పాలి. కొవిడ్ అన్నది ఒక నెలతోనో.. రెండు నెలలతోనో పూర్తి అయ్యేది కాదన్న విషయంపై ఆయనకు స్పష్టత ఉందన్నది తెలిసిందే. అందుకే.. కొవిడ్ పేరు చెప్పి.. ప్రభుత్వం అమలు చేసే ఇతర కార్యక్రమాలు పక్కన పెట్టేయకూడదన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో.. పాలనా వేగాన్ని పెంచేందుకు అవసరమైన నిర్ణయాల్ని తీసుకునేందుకు వీలుగా ఆయన చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెప్పాలి.
తాజాగా జరిగిన బదిలీల్లో అందరిని ఆకర్షిస్తున్న బదిలీలు రెండు. అందులో ఒకటి క్రిష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ బదిలీ అయితే.. రెండోది అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడి బదిలీగా చెబుతున్నారు. అధికారులు ఎవరైనా సరే.. వారి పని తీరు ఎంత బాగున్నా సరే.. పార్టీ నేతలు.. ముఖ్యంగా మంత్రులు..ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వారి పట్ల ఏమాత్రం దూకుడుగా వ్యవహరించకూడదన్న సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. కొవిడ్ వేళ పాలన స్తంభించిపోలేదన్న విషయాన్ని స్పష్టం చేయటం తాజా బదిలీలతో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు.
తాజాగా బదిలీలు అయిన ఐఏఎస్ ల్లో ఎవరిని ఎక్కడకు పోస్టింగ్ ఇచ్చారన్నది చూస్తే..
- కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ చేసింది.
- అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిని గ్రామ వార్డుసెక్రటరీగా నియమించారు.
- శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ బదిలీ చేసి.. ఎల్.ఎస్. బాలాజీరావును నియమించారు
- అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి
- అనంతపురం జాయింట్ కలెక్టర్ గా టి.నిశాంతి
- చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా వెంకటేశ్వర్
- పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా రోనకి గోపాలక్రష్ణ
- ప్రకాశం జిల్లా జేసీగా విశ్వనాథం
- కడప జాయింట్ కలెక్టర్ గా ధ్యానచంద్ర
- తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా జాహ్నవి
- పశ్చిమగోదావరి జిల్లా జేసీగా ధనుంజయ్
- కర్నూలు జిల్లా జేసీగా ఎన్. మౌర్య
- గుంటూరు జేసీగా అనుపమా అంజలి
- నెల్లూరు జేసీగా విదేహ్ కేర్
- విజయనగరం జేసీగా మయూర్ అశోక్
- ఏపీ ఆగ్రోస్ ఎండీగా ఎస్.కృష్ణమూర్తి