ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బ‌దిలీ

Update: 2020-05-20 04:15 GMT
ఇన్నాళ్లు మ‌హ‌మ్మారి వైర‌స్‌పైనే ప్ర‌ధాన దృష్టి సారించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇక మిగ‌తా అంశాల‌పై కూడా ఫోక‌స్ పెట్ట‌నుంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్న స‌మ‌యంలో ప‌రిపాల‌న‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేశారు. మొత్తం 16 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సంద‌ర్భంగా బ‌దిలీలు జ‌రిగిన ఐఏఎస్ అధికారులు వీరే..
కె. ప్రవీణ్ కుమార్ - బీసీ వెల్ఫేర్ స్పెషల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి‌
రజత్ భార్గవ్ - అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖ
కె. రామ్‌గోపాల్ - క్రీడలు, యువజన సంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా
కాంతిలాల్ దండే - ఎస్టీ వెల్ఫేర్ గిరిజన సంక్షేమం సెక్రటరీగా
సిద్ధార్థజైన్ - సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌ గా (అదనపు బాధ్యతలు)
కన్నబాబు - మత్స్యశాఖ కమిషనర్‌గా (అదనపు బాధ్యతలు)
జి.శ్రీనివాసులు - ఎస్సీ కార్పొరేషన్ ఎండీ గా
ఎ.సిరి - అనంతపురం జాయింట్ క‌లెక్ట‌ర్‌ గా (అభివృద్ధి)
దిల్లీరావు- పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ డైరెక్టర్‌గా
వి.రామారావు - శాప్ ఎండీగా (అదనపు బాధ్యతలు)
పి.అర్జున్‌రావు - దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా
చామకూరి శ్రీధర్ - సీతంపేట ఐటీడీఏ ఈఓ
స్వప్నిల్ దినకర్ - నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా
సునీల్‌కుమార్‌రెడ్డి - కాకినాడ మున్సిపల్ కమిషనర్‌ గా
ఎం. మధుసూదన్‌ రెడ్డి - ఫైబర్ నెట్ ఎండీ
వీజీ వెంకట్‌రెడ్డి - ఏపీ ఎండీసీ ఎండీ (ఇంచార్జ్) గా
Tags:    

Similar News