వెంకట్రామిరెడ్డి ... ఫక్తు రాజకీయ నేతై పోయారే

Update: 2021-11-20 06:31 GMT
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు అని సామెత. దీనిని ఎంతమంది అనుసరిస్తున్నారో తెలియదు కానీ.. రాజకీయ నేతలు మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా .. అక్కడికి వాలిపోతుంటారు. పవర్ లో లేకపోతే నేతలకు నిద్ర పట్టదు. పూటకొక పార్టీలో చేరుతూ.. అధికారం చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. అందురూ ఏమో గాని  కలెక్టర్ గిరికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికి మాత్రం రాజకీయాలు బాగా వంటబట్టాయి. అలా కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు.. ఇలా ఆయనను కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తెల్లారే టీఆర్‌ఎస్ అధిష్టానం వరి దాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఇంతలోనే వెంకట్రామిరెడ్డి రాజకీయ నేతగా మారిపోయారు. మెడలో ఆకుపచ్చ జెండాతో ధర్నాలో తళుక్కుమన్నారు.

సిద్దిపేట కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి ఉన్నప్పుడు రైతులు వరి పంట వేయద్దని, డీలర్లు కిలో వరి విత్తనాలు అమ్మినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పినా తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. దీంతో సిద్ధిపేటకు చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ తర్వాత వెంకట్రామిరెడ్డిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అధికారిగా ఉన్న సమయంలో వరిపంట వేయవద్దని హెచ్చరించిన సారు.. రాజకీయ నేతగా మారిన వెంటనే దాన్యం కొలుగోలు చేయాలని ధర్నా చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిలా ఉంటే ఒకలా.. రాజకీయ నేతగా మారితే మరోలా మరిపోతారా? అని ప్రశ్నిస్తున్నారు.

శ్రీరాముడికి హనుమంతుడు ఎంతో కేసీఆర్ కు వెంకట్రామిరెడ్డి అంతే అని అందరూ అంటుంటారు. కేసీఆర్ ఆదేశిస్తే చాలు ఇట్టే అన్ని పనులు చకచక చేస్తుంటారని చెబుతుంటారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా.. ఆ తర్వాత సిద్ధిపేట కలెక్టర్‌గా.. కేసీఆర్ చెప్పిన ప్రతీపని కాదనకుండా చేస్తూ.. ఆయన మనసును వెంకట్రామిరెడ్డి చూరగొన్నారని అందరూ చెబుతున్న మాట. ఆయనకు కేసీఆర్ అంటే ఎంత భక్తి అంటే మాటలతో వర్ణంచడం కష్టం. సిద్ధిపేట నూతన కలెక్టర్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ కు పాదాభివందనం కూడా చేశారు. అప్పట్లో వెంకట్రామిరెడ్డి పై పలు విమర్శలు కూడా వచ్చాయి.

నమ్మిన వ్యక్తులను అందలం ఎక్కించడంలో కేసీఆర్‌ ముందుంటారనే ప్రచారం ఉంది. వెంకట్రామిరెడ్డిని ఎప్పటి నుంచో ప్రజా ప్రతినిధి చేసేందుకు కేసీఆర్‌ తగిన అవకాశం కోసం వేచిచూస్తున్నారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో దుబ్బాక ఉప ఎన్నికలో వెంకట్రామిరెడ్డిని కేసీఆర్‌ బరిలో నిలుపుతారనే ప్రచారం జరిగింది. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీగా చేయాలని కేసీఆర్‌ ఫిక్సయ్యారు. ఎమ్మెల్సీతోనే ఆగకుండా ఆయనను రెవెన్యూ మంత్రిగా చేస్తారని కూడా చెబుతున్నారు. టీఆర్‌ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖకు మంత్రిని కేటాయించలేదు. ఆ శాఖ ఇప్పటికీ కేసీఆర్ వద్దే ఉంది. కలెక్టర్ గా అనుభవాన్ని గడించిన వెంకట్రామిరెడ్డికి  రెవెన్యూ శాఖను కట్టబెడుతారని చెబుతున్నారు.
Tags:    

Similar News