పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా రేపు సిడ్నీలో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. డచ్ జట్టు నుంచి పెద్దగా ముప్పు లేకపోయినా మెన్ ఇన్ బ్లూ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే సిడ్నీలో ఐసీసీ కల్పిస్తున్న సౌకర్యాలు టీమిండియాను తీవ్రంగా కలచివేస్తున్నాయి.
టీమిండియాకు మేజర్ సమస్యగా తినే ఆహారం మారింది. కఠోర శిక్షణ తర్వాత, టీం ఇండియా సభ్యులు మంచి భోజనాన్ని ఆశించారు. కానీ వారు పూర్తిగా షాక్ కు గురయ్యే ఆహారం పెట్టారు. ఏమాత్రం వేడి లేకుండా చల్లటి ఆహారాన్ని పెట్టారు.
ఇది మంచిది పద్ధతి కాదంటూ ఆ ఆహారాన్ని టీమిండియా బాయ్ కాట్ చేసింది. “అక్కడ శాండ్‌విచ్‌లు ,పండ్లు మాత్రమే ఉన్నాయి. కొంతమంది సభ్యులకు ఆహారం నచ్చకపోవడంతో అక్కడ భోజనం చేసేందుకు హోటల్ నుంచి వెళ్లిపోయారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రెండోది టీమ్ ఇండియాకు సిడ్నీకి దాదాపు 42 కిలోమీటర్ల దూరంలోని బ్లాక్‌టౌన్‌లో ప్రాక్టీస్ లొకేషన్ పెట్టారు. ఆ ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుంది .. ప్రాక్టీస్ సెషన్‌ల కోసం సభ్యులు ఎక్కువ దూరం ప్రయాణించడానికి నిరాకరించారు.
ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా టీమిండియాకు తరచుగా పునరావృతమవుతాయి. ఆస్ట్రేలియాలో 2020-2021లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌లోనూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఆసీస్ మీడియా టీమ్ ఇండియాను కుయుక్తుల కోసం నిందలు వేస్తూనే ఉంది కానీ వాస్తవంగా ఆస్ట్రేలియాలో టీమిండియాను అవమానిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ ఎప్పుడూ వారి గురించి మీడియాలో మాట్లాడలేదు. తన సంయమనాన్ని కొనసాగించింది.ఇప్పటికైనా టీమిండియా ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.