ముంచుకొస్తున్న ‘మంచు’ ముప్పు

Update: 2019-08-03 10:05 GMT
మంచు కరిగితే ఏమవుతుంది.? సిల్లీ క్వచ్ఛన్.. నీరు అవుతుంది అని ఠక్కున చెప్పేస్తారు..?  కానీ మన ప్రాణాలకే అది ముప్పు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అవును ప్రపంచంలో మంచుతో కప్పబడి ఉన్న రెండు అతిపెద్ద ద్వీపాలు కరగడం మొదలు పెట్టాయి. ఏకంగా ఒక్క 24 గంటల్లోనే 12 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందట.. దీంతో సముద్రాల మట్టం తాజాగా 0.1 మిల్లీ మీటర్ నుంచి 0.02 ఇంచులకు పెరిగిపోయింది. ఒక మిల్లీ మీటర్ పెరిగితేనే సముద్రంలోని చిన్న ద్వీపాలకు ముప్పు వాటిల్లుతుంది.. తీరం దగ్గరకు వస్తుంది. ఈ మంచు కరగడం ఇలాగే కొనసాగితే సముద్రంలోని దేశాలు కూడా కనుమరుగు కావడం ఖాయమంటున్నారు..

తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్ లాండ్ దేశంలో కప్పబడి ఉన్న భారీ మంచు కరిగిపోతోందట.. గ్రీన్ లాండ్ దేశం ఉత్తర ద్వీపానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో 90శాతానికి పైగా భూభాగం భారీ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు భూమిపై పెరిగిపోతున్న వేడి, కాలుష్యానికి ఇక్కడి మంచు భారీగా కరుగుతోంది. జూలై 31న అతి ఎక్కువగా మంచు కరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు తేల్చారు. 2012 నాటి నుంచి ఇదే అతి ఎక్కువగా కరగడమట.. ఒక్క జూలైలోనే 197 బిలియన్ టన్నుల మంచు కరిగి అట్లాంటిక్ సముద్రంలో కలిసింది.

ఇక దక్షిణాదిలోని అంటార్కిటికా ఖండంలో కూడా భూతాపానికి మంచు కరగడం మొదలుపెట్టింది. భూమిపై కాలుష్యం, వేడి ఇలానే పెరుగుతూ పోతే క్రమంగా మంచు కరిగి సముద్రాల్లోని దేశాలు మునిగిపోవడం.. తీరాలు కరిగిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

    

Tags:    

Similar News