చేతిలో ఉన్నప్పుడు కొన్నింటి విలువ తెలీదు. చేజారిన తర్వాత కానీ దాని విలువ తెలుస్తుంది. అదిరే ట్రాక్ రికార్డు ఉన్నా.. జట్టులో ఆడే అవకాశం రాని క్రికెటర్లలో అంబటి రాయుడి పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. 72.33 సగటుతో పరుగుల వరద పారించే అతగాడికి అవకాశం ఇచ్చేందుకు సెలెక్టర్లు అతడ్ని పక్కన పెట్టేస్తుంటారు.
తాజాగా అలాంటి చేదు అనుభవం మరోసారి ఎదురైంది. ప్రతిభ ఉన్నా తెలుగోడికి గుర్తింపు తక్కువేనని.. జట్టులోకి రావటానికి టాలెంటే అన్ని సందర్భాల్లో ఆదుకోదన్న విషయం రాయుడి విషయంలో ప్రతిసారీ వినిపిస్తూ ఉంటుంది. విజయ్ శంకర్ గాయం నేపథ్యంలో వెనక్కి వెళ్లిపోవటంలో బ్యాకప్ ప్లేయర్ గా ఉన్న అంబటి రాయుడికి అవకాశం లభిస్తుందని భావించారు.
కానీ.. ఆ అంచనాలు తప్పన్న విషయం మయాంక్ అగర్వాల్ కు పిలుపు అందటంతో తేలిపోయింది. దీంతో రాయుడి క్రికెట్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లేనని భావిస్తున్నారు. ఇలాంటి వేళలో ఐస్ ల్యాండ్ క్రికెట్ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యింది. గతంలో రాయుడి 3డీ ట్వీట్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేస్తూ.. పౌరసత్వం ఇస్తామని.. తమ దేశం తరఫున క్రికెట్ ఆడాలని ట్వీట్ చేసింది.
రాయుడు 3 డీ కళ్లజోడును పక్కన పెట్టాలి. మేం పంపిన ఆహ్వానాన్ని చదవటానికి మామూలు కళ్లజోడు పెట్టుకోవాలి. మాతో చేతులు కలుపు అంబటి అంటూ ఐస్ ల్యాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. తమ దేశ పౌరసత్వం కోసంచిన్న చిట్టి మీద అప్లికేషన్ పెడితే చాలు.. మిగిలినదంతా తాము చూసుకుంటామని పేర్కొంది. మరి.. దీనికి రాయుడి స్పందన ఎలా ఉండనుందో చూడాలి.