చెత్త వాహనంలో గణేషుడి విగ్రహాలా ?

Update: 2021-09-08 11:31 GMT
బహిరంగ ప్రదేశాల్లో  వినాయక చవితి ఉత్సవాల వివాదం ఒకవైప నడుస్తుండగానే మరో వివాదం మొదలైంది. తాజా వివాదం ఏమిటంటే చెత్త వేసుకునే వాహనాల్లో వినాయకుడి విగ్రహాలను తరలించటం. అయితే వివాదం మొదలుకాగానే వెంటనే ప్రభుత్వం స్పందించి అందుకు బాధ్యులను గుర్తించటం, యాక్షన్ తీసుకోవట కూడా జరిగిపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరు మున్సిపాలిటికి చెందిన గార్బేజి వాహనంలో నాలుగు గణేషుడి విగ్రహాలను తరలించారు. ఈ విషయాన్ని గమనించిన స్ధానికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అసలే వినాయకచవితి ఉత్సవాల వివాదం నడుస్తుండటంతో ఇపుడు చెత్త వాహనాల్లో విగ్రహాల తరలింపు వీడియా బాగా వైరల్ అయిపోయింది.

సోషల్ మీడియాలో వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళగానే విచారణ జరిపించింది. మున్సిపాలిటిలోని ఓ శానిటరీ ఇన్సె పెక్టర్ అనాలోచితంగా చేసిన పనిగా తేలింది. అయినా వినాయకుడి విగ్రహాలను చెత్త లారీల్లో తరలించిన కారణంగా సదరు ఇన్ స్పెక్టర్ ను ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది.  సంఘటనపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. అసల వాస్తవాలేమిటో తెలియాల్సుంది. 
Tags:    

Similar News