ఎఫ్ఐఆర్ నిరాకరిస్తే మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలి..

Update: 2022-02-07 02:30 GMT
పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులపై హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టులో రిట్ దాఖలు చేస్తున్నారు. అయితే అధికరణ 226 కింది పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే రిట్ దాఖలు చేయడానికి వీలు లేదని పేర్కొంది. అయితే  ప్రైవేట్ గా కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్ర  సమర్థించారు. చట్టం కల్పించిన హక్కుల ద్వారా సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద ప్రైవేట్ గా ఫిర్యాదులు చేసుకోవాలని స్పష్టం చేసింది.

కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టబుడుతున్నారు. అయితే పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని వ్యాజ్యాలు వేస్తున్నారు. ఇటీవల కొందరు కోర్టులు ఇలాంటి వ్యాజ్యాలు వేయడంతో ఏకసభ్య ధర్మాసనం వాటిపై విచారణ చేసింది. కాగ్నిబుల్ నేరాల విషయంలో ఫిర్యాదు అందితే ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మెజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని తెలిపింది. అయితే హైకోర్టు కంటే మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించడం ప్రయోజనకరమని స్పష్టం చేసింది.

ఈ మేరకు ధర్మాసం ఆ వ్యాజ్యాలను కొట్టివేసింది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. దీంతో పిటిషనర్ తరుపున న్యాయవాది సువ్వారి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లలిత కుమారి  కేసులో సుప్రీం ఇచ్చిన  తీర్పును ఉదహరించారు. కాగ్నిజబుల్ కేసుల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకొని పోలీసులు ఫిర్యాదులను తిరస్కరించే ప్రమాదం ఉందన్నారు.

అయితే ఈ వాదనలను ధర్మాసరం తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసుకోవాలన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 200, 154 (3), 156(3) ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని గుర్తు చేశారు. పోలీసులు ఫిర్యాదుపై ఎప్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 2000 ద్వారా ప్రైవేట్ ఫిర్యాదులు చేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల అప్పలును కొట్టివేసి.. ఆ ఉత్తర్వులను కొనసాగించాలని తెలిపింది.

    
    
    

Tags:    

Similar News