రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో పార్టీ అధినేతల మీద నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేయటం.. లోపాల్ని జంకు లేకుండా ప్రస్తావించే నేతల్ని వేళ్ల మీద లెక్కించొచ్చు. తాను ఏ పార్టీలో ఉన్నా.. తన తీరును మాత్రం మార్చుకోవటానికి సిద్ధంగా ఉండని నేతల్లో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. సమయానికి అనుకూలంగా ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. తాజాగా అలాంటి విషయాల్నే చెప్పుకొచ్చారు.
పార్టీ అధినేత చంద్రబాబులోని లోపాల్ని ఎత్తి చూపుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా చంద్రబాబులో మారని కొన్ని పద్దతుల్ని ప్రస్తావిస్తూ.. ఆయన తక్షణమే మారాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. విషయం ఏదైనా సూటిగా.. స్పష్టంగా చెప్పకుండా.. గంటల తరబడి సాగదీయటం చంద్రబాబుకు అలవాటుగా చెప్పిన జేసీ.. ఆ అలవాటును మార్చుకుంటేనే టీడీపీ బాగు పడుతుందన్నారు.
అధికారులతో సమీక్షలు.. చర్చల పేరుతోటైం వేస్టు చేసేవారని.. ఇప్పటికి ఆయన తన అలవాట్లను మార్చుకోలేదన్నారు. పది నిమిషాల్లో అయిపోయే ప్రసంగానికి వంద నిమిషాలు చేస్తుంటారని.. టైం వేస్టు చేయటంలో చంద్రబాబు ముందుంటారన్నారు. తనను కలిసేందుకు ఎవరైనా వస్తే.. వారి యోగక్షేమాలు.. కుటుంబ బాగోగుల గురించి బాబు ఏ రోజు అడగలేదన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు మాత్రం కుటుంబ బాగోగులు.. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు.. ఆరోగ్యం గురించి ఆరా తీయటమే కాదు.. ఏ పని మీద వచ్చారో కనుక్కుంటారన్నారు.
అలాంటి అలవాటు చంద్రబాబు వద్ద తాను ఎప్పుడూ చూడలేదన్న జేసీ.. ఆయనలోని లోపాల్ని ఎత్తి చూపేందుకు ఏ మాత్రం మొహమాటపడలేదు. ‘‘బాబులొని లోపాల్ని ఆయనకు ఎన్నో సార్లు చెప్పారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రస్తావించా. బహిరంగంగానూ చెప్పా. కానీ.. ఆయనలో మాత్రం మార్పు రాలేదు. ప్రస్తుత రాజకీయాల్లో బాబు అత్యంత సీనియర్. అయినా.. ఇప్పటికి ఆయనలో మార్పు రాలేదు. భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం లేదు’’ అని తేల్చేశారు.
బాబులో మార్పు కానీ రాకుంటే.. జగన్ చేతిలో మరోసారి చావుదెబ్బ తప్పదన్నారు. పార్టీలో అందరి మనసుల్లోనే ఇదే మాట ఉందన్న జేసీ.. తాను మాత్రమే బయటకు చెబుతున్నానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే తాను కోరుతున్నానని చెప్పారు.
తాను ఒక్కడినే సీనియర్ ను అని.. మిగిలిన వారంతా పిల్లలు అనుకునే తీరులో బాబు వ్యవహరిస్తుంటారన్నారు. ‘బాబు సీనియరే కాదను. కానీ.. ముప్ఫై ఏళ్లుగా మేం కూడా రాజకీయాలు చేస్తున్నాం. మేం కూడా చిన్నపిల్లలం అనుకుంటే ఎలా? ఆయన ఈ అలవాటు ఎంత త్వరగా మార్చుకుంటే పార్టీకి అంత మంచిది’ అని జేసీ కుండ బద్ధలు కొట్టేశారు. ఏ మాటకు ఆ మాటే ఇలాంటి మాటలు జేసీ మాత్రమే చెప్పగలరని చెప్పక తప్పదు.