టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు వైసీపీ నేతలు. ఏదో చెప్పాలన్న ఆరాటం. కానీ.. ఏమీ చెప్పలేని నిస్సహాయత. అందుకే కాబోలు అలవాటుగా మారిన మూడు మాటల్ని అటు తిప్పి ఇటు తిప్పటమే తప్పించి.. కొత్తగా ఏమీ చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జగన్ అండ్ కో. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ.. ఆయనపై విమర్శలు కురిపించే వైసీపీ నేతల నోటి నుంచి వచ్చే మాటలు తెలిసిందే. ఇటీవల పవన్ మాట్లాడుతూ.. తనను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలపై విరుచుకుపడటమే కాదు.. చెప్పుతో కొడతా నా కొడకల్లారా? అంటూ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. అదే సమయంలో.. తాను అందరు వైసీపీ నేతల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయటం లేదని.. కొందరు బూతులు మాట్లాడే నేతల్ని ఉద్దేశించి మాత్రమే అంటున్నట్లుగా ఆయన స్పష్టం చేయటం తెలిసిందే.
అధికారపక్ష నేతల్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా పవన్ ను కలిసేందుకు విజయవాడలోని నొవాటెల్ హోటల్ కు వెళ్లి.. భేటీ కావటం.. దాదాపు గంటన్నరకు పైనే సమావేశం కావటం వైసీపీ వర్గాల్లో కొత్త టెన్షన్ ను తెప్పిస్తోంది. చంద్రబాబు - పవన్ ఇద్దరు కలిస్తే తమ అధికారం గల్లంతు అనే విషయంపై వారు ఆందోళన చెందుతున్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారు రియాక్టు అవుతూ.. తాము ఎప్పుడు ప్రస్తావించే ప్యాకేజీ స్టార్ మాటల్ని శక్తి మేర వల్లిస్తూ.. మరింత బలంగా ఆ మాటను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
ఈ క్రమంలో బూతులు మాట్లాడటంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. పవన్ ను ఉద్దేశించి ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ సిగ్గు శరం లేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నారని.. అందుకే ప్రజలు తాము పీకేని ప్యాకేజ్ స్టార్ అనుకుంటున్నామన్నారు. వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా జగన్ చిటికెన వేలును కదల్చలేరంటూ విరుచుకుపడ్డారు.
పవన్ కల్యాణ్.. బ్రహ్మనందం డైలాల్ని వదిలి సక్రమమైన మార్గంలో వెళ్లాలన్న ఆయన.. చంద్రబాబు కోసం చిల్లర వేషాలు వేస్తూ పవన్ చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. "సభలో చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ దాచిన చెప్పుతో 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు ముందు తాను కొట్టుకొని.. ఆ తర్వాత తన స్థితికి కారణమైన చంద్రబాబును పవన్ కొట్టాలి. చంద్రబాబుకు ఊడిగం చేయటానికే జనసేన ఏర్పడింది. పవన్ కు కాపులు.. ప్రజలు ముఖ్యం కాదు. జగన్ ను గద్దె దించటమే ప్రధానం. వంద మంది పవన్ లు వచ్చినా జగన్ ను కదల్చలేరు" అంటూ మండిపడ్డారు.
కొడాలి నాని చెప్పిందే నిజమని అనుకుందాం. నిజంగానే పవన్ ప్రభావం ఏమీ ఉండదని అనుకుందాం. మరి.. ప్రభావం లేని పవన్ గురించి అదే పనిగా నోరు పారేసుకోవటం ఎందుకు? ఆయన్ను ఏదో ఒక మాట అనటం ఎందుకు? అన్నది అసలు ప్రశ్న. కొడాలి నాని లాంటి నేతలు.. ఉత్త పుణ్యానికి ఎవరిని టార్గెట్ చేయరు. వారు అలా చేశారంటే లెక్కలు ఉండనే ఉంటాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ కు బలం అంటూ ఏమీ లేదని చెప్పే కొడాలి నాని.. అందుకు విరుద్ధంగా ఆయన బలం గురించి తన మాటలతో తమకున్న భయాన్ని బయటపెట్టుకున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
వైసీపీ చేపట్టిన గర్జన నుంచి ప్రజల్ని డైవర్టు చేయటానికే పవన్ ను చంద్రబాబు వైజాగ్ కు పంపారని.. ఆయనకు ఆత్మాభిమానం కంటే ప్యాకేజీలు ముఖ్యమన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ మంత్రుల్ని బూతులు తిడుతూ దాడి చేశారన్నారు. ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండా వేరే పార్టీకి మద్దతు తెలిపిన ఏకైక పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కొడాలి నాని మాటల్ని చూస్తే.. పవన్ ను బద్నాం చేయాలన్నదే లక్ష్యమైతే.. ఆయన మాటల్ని విన్నంతనే.. పవన్ బలం ఎంతన్నది కళ్లకు కట్టినట్లుగా కనిపించటం గమనార్హం. ఇలా అయితే ఎలా కొడాలి నాని? అంటూ ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.