తమ దేశంలో శాంతిభద్రతలకు విఘాతంగా మారిన రోహింగ్యా ముస్లిం తెగలను తన్ని తరిమేస్తున్న మయన్మార్ ఎపిసోడ్ లోకి హైదరాబాద్ ఎంపీ - మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసుదుద్దీన్ ఎంట్రీ ఇచ్చారు. రోహింగ్యాలతో దేశానికి ముప్పు అని, వాళ్ల విషయంలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. వాళ్లను ఇస్లామిక్ స్టేట్ వాడుకొనే ప్రమాదం ఉందని తన అఫిడవిట్ లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. రోహింగ్యా శరణార్థులకు ఎందుకు ఆశ్రయం కల్పించరు అని ఓవైసీ ప్రధానిని ప్రశ్నించారు.
హైదరాబాద్ లో జరిగిన ఒక సభలో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ రొహింగ్యా ముస్లిం కాందిశీకులను తిరిగి మయన్మార్ కు పంపేయాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని ఓవైసీ తప్పుపట్టారు. రొహింగ్యా ముస్లిం కాందిశీకులను ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు సోదరులుగా అంగీకరించలేరని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. భారత్‌కు వస్తున్న రొహింగ్యా ముస్లిం కాందిశీకులను ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ భారత్ లో నివసించడానికి అనుమతి ఇచ్చినప్పుడు రోహింగ్యా ముస్లింలను మోడీ ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. దాదాపు 65వేల మంది తమిళ కాందిశీకులు బారత్ లో నివసిస్తున్నారనీ, రొహింగ్యాలు ఎందుకు నివసించకూడదని ఓవైసీ ప్రశ్నించారు. బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ మీకు సోదరి అయినప్పుడు - మయన్మార్ రోహింగ్యాలు ఎందుకు సోదరులు కారని ఓవైసీ ధ్వజమెత్తారు. ఆశ్రయం కోసం వస్తున్న రోహింగ్యాలను వెనక్కి పంపాలని బీజేపీ నిర్ణయించడాన్ని ఓవైసీ తప్పుపట్టారు.
కాగా, దేశ భద్రత దృష్ట్యా వాళ్లను ఇక్కడి నుంచి రోహింగ్యాలను పంపించేయాల్సిందేనని తన అఫిడవిట్లో కేంద్రం స్పష్టంచేసింది. కొందరు రోహింగ్యాలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని - ఇప్పటికే వాళ్లు ఢిల్లీ - జమ్ము - హైదరాబాద్ - మేవాట్ లలో క్రియాశీలకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని కేంద్రం కోర్టుకు తెలిపింది. సమగ్ర సమాచారంతోనే రోహింగ్యా శరణార్థులను దేశం నుంచి బహిష్కిరించాలని నిర్ణయించామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో సుప్రీంకోర్టు జోక్యం సరికాదని కేంద్రం చెప్పింది. రోహింగ్యాలను దేశంలోకి అనుమతించడం వల్ల భారత పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతోపాటు వాళ్ల భద్రతకు కూడా ముప్పు వాటిల్లుందని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు రోహింగ్యాలకు పాకిస్థాన్ - బంగ్లాదేశ్ లలోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు కూడా తమ దగ్గర స్పష్టమైన సమాచారం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మతపరమైన హింసకు కూడా వీళ్లు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు చెప్పింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రోహింగ్యాలను దేశం నుంచి పంపించేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక్కడ ఉండే బౌద్ధులపై దాడులకు పాల్పడుతూ.. మయన్మార్ కు వ్యతిరేకంగా చేసే ఆందోళనల వల్ల ఈశాన్య రాష్ట్రాలు మరింత కల్లోలంగా మారే ప్రమాదం ఉన్నట్లు కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అక్రమంగా దేశంలోకి చొరబడిన ఇలాంటి వాళ్లకు అన్ని వసతులు కల్పిస్తే అది ఇక్కడి పౌరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని స్పష్టంచేసింది.