ఆధార్ నెంబర్ తప్పుగా చెప్పారో ...ఫైన్ ఎంత కట్టాలంటే ?

Update: 2019-11-13 08:40 GMT
ఆధార్ కార్డ్ ..ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ఏకైక కార్డ్ ఇదే. అసలు ఆధార్ కార్డ్ లేకపోతే మనం ఈ దేశంలోనే లేనట్టే ... అలాగే ప్రస్తుతం ఏ ఒక్క  పని కావాలన్నా కూడా ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరి చేయడంతో ప్రతి ఒక్కరు ఆధార్ ని క్యారీ చేస్తున్నారు. అలాగే ఆధార్ కార్డ్ కి కూడా బాగా అలవాటు పడ్డారు. కానీ, ఇదే ఆధార్ తో చాలా లాభాలు ఉన్నప్పటికీ .. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కావాలని చేసినా ..పొరపాటున చేసినా కూడా తప్పు తప్పే. కాబట్టి ఆధార్ నెంబర్ ఉపయోగించే ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది.

మీ ఆధార్ కార్డ్ లో ఈ ఒక్క తప్పు చేసారో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. ఆధార్ విషయంలో ఎలాంటి తప్పులు చేసినా ఇక ఇప్పటినుండి తప్పించుకోలేరు.  పన్ను చెల్లింపుదారులు పాన్ బదులు ఆధార్ కార్డు సమర్పించుకునే విధంగా సెప్టెంబర్ 1వ తేదీ 2019న కొత్త నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ రిటర్న్స్‌తో పాటు బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్, 50 వేల రూపాయల బాండ్స్‌, డిమాట్ ఖాతాలకు పాన్ బదులుగా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చే వెసులుబాటు ఉంది.

అయితే కొందరు తప్పుడు ఆధార్ నెంబర్లు ఇస్తున్నట్లు అధికారుల దృష్టి వచ్చింది. దీనితో ఐటీ శాఖ ఫోకస్ పెట్టి.. తప్పుడు ఆధార్ ఇచ్చినవాళ్లకు భారీగా ఫైన్ విధించే రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది. కావాలని ఆధార్ నెంబర్ తప్పుగా ఇచ్చినా లేదా పొరపాటున తప్పుగా నెంబర్ దాఖలు చేసినా భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాదాపు రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

1961 ఐటీ చట్టం సెక్షన్ 272 b కింద ఈ జరిమానా విధిస్తున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. గతంలో ప్యాన్ నెంబర్ తప్పు ఇచ్చినప్పుడు ఇలాగే జరిమానా విధించేవారు. ఇప్పుడు అదే రూల్‌ని ఆధార్‌కు పునరుద్ధరించారు. అంతేకాక బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. పాన్ కార్డు ఇవ్వని పన్నుదారులు ఆధార్ కార్డును సమర్పించిన సందర్భాల్లో మాత్రమే కొత్త పెనాల్టీ నిబంధనలు వర్తిస్తాయి.
Tags:    

Similar News