మహారాష్ట్ర లో బీజేపీ వ్యూహం అమలై తే సేన భూమి లో కలిసి పోవాల్సిందేనా ..?

Update: 2019-11-11 10:26 GMT
బీజేపీ .రెండుసార్లు వరుస గా  కేంద్రం లో అధికారాన్ని చేపట్టి ..మెల్లి మెల్లిగా దేశం మొత్తం కాషాయ జెండాలని ఎగుర వేయాలని అనుకుంటుంది. బీజేపీ కి ప్రధాన బలం అమిత్ షా .. బీజేపీ లో వ్యూహాల కింగ్ . అమిత్ షా వ్యూహం పన్నితే ..ఎదుట ఎంతటి వాడు ఉన్నా కూడా మట్టి కొట్టుకు పోవాల్సిందే. అంతటి మహా వ్యూహ కర్త ఉన్నప్పటికి ..మహారాష్ట్ర లో బీజేపీ అధికారానికి దూరం కాబోతుంది. దీనికి ప్రధాన కారణం శివసేన సీఎం సీటు పై పట్టు విడవక పోవడమే ... కచ్చితం గా పదవి సగం -సగం అని చెప్పడం తో బీజేపీ దాన్ని నిరాకరించింది. దీనితో బీజేపీ నుండి బయట కి వచ్చిన శివసేన .. ఎన్సీపీ , కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కి సిద్ధ మౌతోంది. దీనితో బీజేపీ ...శివసేన ని ఇప్పటికిప్పుడే కాక పోయినా వచ్చే రోజుల్లో కోలుకో లేని దెబ్బ కొట్టడానికి వ్యూహం వేస్తున్నట్టు ప్రస్తుత పరిస్థుతులని బట్టి అర్థమౌతుంది.

శివసేన మద్దతు లేక పోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు కి పిలిచినా కూడా సరైన సంఖ్యా బలం లేదు అని వెనక్కి తగ్గింది. కానీ , శివసేన , ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తమ వ్యూహానికి పదును పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. శివసేన ఎన్డీయే నుంచి బయటికి వస్తే.. మద్దతు విషయం చూస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కి షరతు విధించడం తో  ఎన్డీఏ కేబినెట్‌ లో వున్న అరవింద్ సావంత్ తన పదవి కి సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. బయటి నుంచి మద్దతు తీసుకోకుండా.. ప్రభుత్వం లో భాగస్తులు కావాలని శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను కోరుతోంది. ఈ రకం గా సీఎం పదవి శివసేన తీసుకుని, ఒక్కో డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కు ఇవ్వచూపుతోంది. ఇదే జరిగితే హిందుత్వ ఎజెండాతోనే రాజకీయం చేసే శివసేనతో కాంగ్రెస్ పార్టీ కలిస్తే, అది దేశ వ్యాప్తంగా ప్రభావం చూపనుంది.  ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని మహారాష్ట్రలో ఏకైక హిందుత్వ పార్టీగా బిజెపి నిలిచేందుకు వ్యూహం రచించవచ్చు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండ గట్టిన శివసేన వారితో కలవడం తో ఓట్లు వేసిన ప్రజలకి ఏ విధమైన సమాధానం చెప్తుంది అనేది అందరి మదిలో మెదులుతుంది.

కర్నాటక లో తక్కువ సీట్లున్న జెడిఎస్ పార్టీకి సీఎం సీటిచ్చి చేసిన ప్రయోగం విఫలమైనా కూడా కాంగ్రెస్.. శివసేనకు మద్దతి స్తే.. ఏడాది లోగా ప్రభుత్వం మారడమో.. ప్రభుత్వం కూలి పోవడమో జరుగుతుందని బిజెపి భావిస్తోంది. అదే జరిగితే.. మళ్ళీ ఎన్నికలోస్తే.. శివసేన చేసిన నమ్మక ద్రోహాన్ని, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల అపవిత్ర కలయిక ఆసరాగా జనం ముందుకు వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా భారీగా లాభ పడవచ్చన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. మరి కొందరు బీజేపీ నేతలు మాత్రం  .. ఎన్నికల లో శివసేన తో పొత్తు పెట్టుకోకుండా వున్నింటే ..కచ్చితంగా మెజారిటీ స్థనాలని గెలుచు కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారం అంటూ చెప్తున్నారు.
Tags:    

Similar News