శాసనమండలి రద్దు కాకుంటే.. చంద్రబాబు పద్ధతిలోనే జగన్

Update: 2020-02-20 11:45 GMT
శాసనమండలి రద్దు అంశం ఇంకా ఎటు తెగలేదు. ఈ అంశంపై గవర్నర్ కు శాసనమండలి చైర్మన్ ఫిర్యాదు చేయడంతో ఇది గవర్నర్ కోర్టులో పడింది. అధికార వికేంద్రీకరణ చేయాలనే నిర్ణయంతో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టి శాసనమండలికి పంపితే సెలక్ట్ కమిటీకి పంపించాలని చైర్మన్ నిర్ణయించడంతో వివాదం ఏర్పడింది. అయితే దీనిని మండలి కార్యదర్శి తిప్పు పంపుతుండడంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితిలో కార్యదర్శిపై చైర్మన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొంది.

ఈ మొత్తం వ్యవహారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసహనానికి గురవుతోంది. మండలి జరిగిన పరిణామానికి ఏకంగా శాసనమండలికి సిఫారసు చేశారు. అందులో పరిణామాలు సక్రమంగా ఉంటే శాసనమండలి రద్దు దాక వెళ్లే అవకాశం రాకపోయి ఉండేది. అయితే ఆ శాసనమండలి రద్దు ఇప్పుడిప్పుడే అయ్యేట్టు కనిపించడం లేదు. మూడు రాజధానుల అమలు వెంటనే కావాలి.. శాసనమండలి రద్దు కాకుండా ప్రత్యామ్నాయ మార్గం అధికార పార్టీ యోచించింది. దానికి చంద్రబాబు అనుసరించిన పద్ధతిలోనే వెళ్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉండగా శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీకి అత్యధిక స్థానాలు ఉన్నాయి. మండలిలో బలం పెంచుకుంటే బిల్లులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని గుర్తించిన వైఎస్సార్సీపీ ఫిరాయింపులను ప్రోత్సహిద్దామని నిర్ణయించిందంట. భారీ స్థాయిలో ఎమ్మెల్సీలను తన పార్టీలో చేర్చుకునేలా వ్యూహం సిద్ధం చేసిందంట. దీంతో ఆపరేషన్‌ ఆకర్షకు తెర లేపనున్నట్టు సమాచారం. మండలిలో తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలోనే టీడీపీకి చెందిన శాసనమండలి సభ్యులను పార్టీకి చేర్చుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టిందంట. కలిసొచ్చే సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం.

టీడీపీ సభ్యులతో పాటు, మరికొందరిని కూడా తమ వైపు రావాలని అడుగుతున్నట్లు తెలిసింది.ఈ విషయం గతంలోనే చర్చకు రాగా.. మొదటి నుంచి జగన్ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దనే నియమానికి కట్టుబడి ఉన్నారు. అయితే పరిణామాలు కొంత ఇబ్బంది కరంగా ఉండడం తో ఫిరాయింపులకు ఒకే అన్నట్టు సమాచారం. ఆ క్రమంలో అప్పట్లో చంద్రబాబు తమ శాసనమండలి సభ్యుల సమావేశం నిర్వహించగా ఐదారు మంది గైర్హాజరయ్యారు. అయితే వారంతా అధికార పార్టీలోకి చేరే ఉద్దేశం తో సమావేశానికి రాలేదని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వారితో పాటు మరికొందరిని తమ పార్టీలోకి లాగేందుకు వైఎస్సార్సీపీ పయత్నాలు మొదలు పెట్టిందంట.

శాసన మండలిలో బలం పెరిగితే ఇక జగన్ కు తిరుగుండదు. ఏ నిర్ణయమైనా సునాయాసం గా తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మూడు రాజధానుల బిల్లు పాస్ చేయించుకునేందుకు వీలు చిక్కుతుంది. ఈ విధంగా చంద్రబాబు అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష్ విధానం లోనే జగన్ ముందడుగు వేస్తే పై చేయి సాధించినట్టే.



Tags:    

Similar News