తెలంగాణలో రాజకీయం చేసేందుకు వడివడిగా దూసుకొస్తున్న వైఎస్ షర్మిల తనపై ప్రధానంగా వినిపిస్తున్న ఓ బలమైన విమర్శకు ఖమ్మం సభలో కౌంటర్ ఇచ్చారు. 'ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా.. నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే. ఈ గడ్డ మీద పెరిగా.. చదువుకున్నా.. బరాబర్ తెలంగాణలో నిలబడుతా.. కొట్లాడుతా.. ' అంటూ వైఎస్ షర్మిల ఖమ్మం సభలో వీరావేశంతో చెప్పుకొచ్చారు.
తాను టీఆర్ఎస్ ప్రోద్బలంతో రాలేదని.. బీజేపీ వ్యూహంలో భాగం కాదని.. కాంగ్రెస్ పంపితే రాలేదని షర్మిల స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఎవరో విడిచిన బాణం కాదని.. తనకు తానే వచ్చానని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోనే పుట్టానంటూ చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా వైఎస్ షర్మిల పాత ఫొటోను కొందరు వైరల్ చేస్తున్నారు. షర్మిల పులివెందులలో ఓటు వేసిన చిత్రాన్ని బయటకు తీసి సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో పుడితే ఓటు పులివెందులలో ఎందుకు ఉంది? సరే ఉండనీ.. మరి తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిల పులివెందులలో ఓటు ఎందుకు వేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
'తెలంగాణలో పుడితే ఓటు పులివెందులలో ఓటు ఎందుకు ఉంచుకున్నావ్ షర్మిల' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు. ఆమె పులివెందులలో ఓటు వేసిన చిత్రాలను ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డనంటున్న షర్మిల దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.