టీమిండియాలో చోటు దొరక్కుంటే.. సెలక్టర్లపై సెటైరే.. రాయుడైనా.. షా అయినా..? సాయిబాబాపైనే భారం
"ఓ సాయిబాబా నువ్వుం అంతా చూస్తూనే ఉన్నావనుకుంటున్నా.."కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన యువ క్రికెటర్ ప్రథ్వీ షా... "నువ్వు నన్ను ఫూల్ చేయొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త"సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ స్పందన.. "హోప్".. నితీశ్ రాణా నిట్టూర్పు, "సెట్ బ్యాక్ కంటే కమ్ బ్యాక్ బలమైనది"యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆశావహ పోస్టు... సోమవారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లకు టీమిండియా జట్లను ప్రకటించాక వీరంతా ఇలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, ఇందులో సెటైరికల్ స్పందన కూడా ఉండడం గమనించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా షా, ఉమేశ్ యాదవ్ పెట్టిన పోస్టులు కొంత చర్చనీయాంశమయ్యాయి. 11 ఏళ్లుగా టీమిండియాకు ఆడుతున్న ఉమేశ్, ఎంతో మంచి భవిష్యత్ ఉన్న షా ఇలా అంటారని ఎవరూ ఊహించి ఉండరు.
"షా"కేమైంది...? 2018లో ప్రపంచ కప్ గెలిచిన అండర్ 19 జట్టు కెప్టెన్.. దూకుడుతో పాటు టెక్నిక్ ఉన్నవాడిగా పేరు.. రంజీల్లో, దేశవాళీల్లో వస్తూనే సెంచరీలు కొట్టి, స్కూల్ స్థాయిలో ప్రపంచ రికార్డు సాధించి అందరినీ ఆకర్షించిన షా కెరీర్ ఇప్పుడు సంధి దశలో ఉంది. మూడేళ్ల కిందటే టీమిండియాలోకి వచ్చినా.. అరంగేట్రంలోనే సెంచరీ బాదినా అతడికి కాలం కలిసి రావట్లేదు. రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ లో జరిగిన గులాబీ బంతి టెస్టులో 0, 4 పరుగులకే ఔటవ్వడం అతడి కెరీర్ ను దెబ్బతీసింది. వాస్తవానికి ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మన జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. కానీ, షా వైఫల్యం మీదనే అందరి కళ్లూ పడ్డాయి. మళ్లీ అప్పటినుంచి టెస్టు చాన్సే రాలేదు. ఈ లోగా రాహుల్ రాణించడం, రోహిత్ టెస్టు కెప్టెన్ కావడం అన్నీ జరిగిపోయి షాకు దారులు మూసుకుపోయాయి.
చివరకు గతేడాది జూలైలో వన్డే, టి20 (ఏకైక) ఆడినా షా రాణించింది లేదు. దీంతో సెలక్టర్లు అతడిని పెద్దగా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఇటీవలి దేశవాళీ 10 మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో రాణించినా.. చివరి నాలుగు మ్యాచ్ ల్లో వైఫల్యం దెబ్బతీసింది. ప్రతిభావంతుడైనప్పటికీ.. టీమిండియాలో పోటీ రీత్యా అవకాశం దక్కలేదు. ఇక ఉమేశ్ సైతం అంతే. మంచి పేస్, రనప్, స్టైల్ ఉన్న అతడు... భారీగా పరుగులిస్తుంటాడు. దీంతో టెస్టుల్లో తప్ప పరిమిత ఓవర్ల క్రికెట్ లోకి పరిగణించలేని పరిస్థితి వచ్చింది. అయితే, బ్యాట్స్ మన్ నితీశ్ రాణా ఐపీఎల్ ప్రదర్శనతో ఆశలు పెట్టుకున్నట్లున్నాడు. కానీ, అది పూర్తి స్థాయిలో సరిపోదని తెలుసుకోలేకపోయాడు. రవి బిష్ణోయ్ కూడా ఇంతే.. ఐపీఎల్ లో రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి తేలిపోతున్నాడు. కుల్దీప్, చహల్ ను కాదని అవకాశాలు ఇస్తున్నా నిలుపుకోలేపోతున్నాడు.
నాడు రాయుడు.. నేడు షా 2019 వన్డే ప్రపంచ కప్ జట్టు ఎంపిక ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలుసు. నాడు మంచి ఫామ్ లో ఉండి, ఒకటీ-రెండు సిరీస్ లలో విఫలమైన అంబటి రాయుడును తెలుగు వాడైన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వన్డే ప్రపంచ కప్ నకు ఎంపిక చేయకపోవడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. తనను ఎంపిక చేయకపోవడాన్ని రాయుడు కూడా ఎండగట్టాడు. రాయుడు స్థానంలో తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపిక చేసిన ఎమ్మెస్కే ప్రసాద్.. అతడిని 3డి (బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్) ప్లేయర్ గా అభివర్ణించాడు.
దీనిపై కడుపు మండిన రాయుడు..‘ప్రపంచ కప్ మ్యాచ్ లు చూడడానికి ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలు కొన్నాను’ అంటూ ఎద్దేవా చేశాడు. ఇక తాజాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లకు ప్రకటించిన నాలుగు జట్లలో దేనికీ షాను ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మను ప్రశ్నించగా.. "మేం అతడిని చూస్తూ (గమనిస్తూ) ఉన్నాం" అని బదులిచ్చాడు. దీనిపై షా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ.. "ఓ సాయిబాబా చూస్తూ ఉన్నావా" అంటూ షిర్డీ సాయి ఫొటోతో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారింది. సెలక్టర్లపై నేరుగానే విమర్శలు అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, 23 ఏళ్ల షా తెలుసుకోవాల్సింది ఏమంటే.. అతడికి మంచి భవిష్యత్ ఉంది. అవకాశాలు రాకుండా ఉండవు. అవి వచ్చినప్పుడు అందుకునేలా ఉండడమే అతడు చేయాల్సింది. ఈలోగా తన పని తాను చేస్తూ పోవాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.