`లేచిరా...`క‌రుణానిధిపై పాట...వైర‌ల్!

Update: 2018-07-30 08:39 GMT
రాజకీయ కురువృద్ధుడు - డీఎంకే అధినేత కరుణానిధి....అస్వస్థ‌త‌కు గుర‌వ‌డంతో శుక్ర‌వారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కరుణానిధి పరిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉంద‌ని....వ‌దంతులు వ్యాపించ‌డంతో - ఆయ‌న‌ను చూసేందుకు అభిమానులు - కార్య‌క‌ర్త‌లు భారీగా కావేరీ ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికితోడు, త‌మ సెల‌వుల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని పోలీసుల‌ను ఉన్న‌తాధికారులు ఆదేశించ‌డంతో .....ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. కరుణ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే, వదంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని...ఆయ‌నకు చికిత్స అందిస్తున్నామని.....త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని మాజీ కేంద్ర మంత్రి రాజా చెప్పారు. ఈ నేప‌థ్యంలో ...ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా...క‌రుణ త్వ‌ర‌గా కోలుకొని తిరిగి ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని ఓ పాట‌ను రూపొందించారు. ప్ర‌స్తుతం ఆ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ - మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.  తాను ఎంతగానో అభిమానించే కరుణానిధి క్షేమంగా రావాల‌ని కోరుకున్నారు. "మమ్మల్ని చూసేందుకు లేచిరా..." అంటూ ఇళ‌య‌రాజా ఆల‌పించిన ఆ పాట ....క్ష‌ణాల్లో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. మ‌రోవైపు, కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మ‌రోవైపు, క‌రుణ ఆరోగ్యంపై వ‌దంతుల‌తో కావేరి ఆస్పత్రి పరిసరాలు జ‌న‌సంద్రంగా మారాయి. కాగా, ప‌లువురు వీఐపీలు ఆసుప‌త్రికి చేరుకొని క‌నిమొళి - రాజాల‌తో భేటీ అయ్యారు. తమిళనాడు సీఎం పళని స్వామి త‌న సేలం ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని మ‌రీ ఆసుప‌త్రికి వ‌చ్చారు. డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు - గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్ - కేంద్ర సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్ త‌దిత‌రులు ఆస‌ప‌త్రికి వ‌చ్చారు.
Tags:    

Similar News