పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫేస్ బుక్ సీఈఓకు సోమవారం లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికపై ఇస్లాం వ్యతిరేక కంటెంట్ ను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఇస్లాంపై దాడిచేస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడిపై మండిపడిన కొద్దిసేపటికే ఫేస్ బుక్ సీఈఓకు ఇమ్రాన్ లేఖ రాశారు. ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఇస్లామోఫోబియా పెరిగిపోతుండటం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను ప్రేరేపిస్తోందని సోషల్ మీడియా దిగ్గజానికి రాసిన బహిరంగ లేఖను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు.
ఫేస్బుక్ వేదికగా ఇస్లామోఫోబియో, ఇస్లాంపై విద్వేష కంటెంట్‌ను నిషేధించాలని ఆయన విన్నపించారు. తన లేఖలో ఫ్రాన్స్ లో పరిస్థితిని కూడా ఇమ్రాన్ ప్రస్తావించారు. ఫ్రాన్స్ లో ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ విద్వేష సందేశాలను పంపడం ఆమోదయోగ్యం కాదని పక్షపాతంతో కూడిన ఇలాంటి ఘటనలు హింసాప్రవృత్తిని మరింత పెంచుతాయని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్ లేఖపై ఫేస్ బుక్ ప్రతినిధి స్పందిస్తూ ఏ రూపంలోనైనా విద్వేషాన్ని తాము వ్యతిరేకిస్తామని, మతం, వర్ణం, జాతి ప్రాతిపదికన దాడులను అనుమతించమని స్పష్టం చేశారు.