ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధానిర రైతులు ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి అరసవల్లి వరకు పేరుతో చేస్తున్న ఈ యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చేరుకుంది.
పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ యాత్రకు మంచి ఆదరణ లభించింది. రాజధాని రైతులకు పెద్ద ఎత్తున స్వాగతం లభించిందక్కడ. పాదయాత్ర రథానికి స్థానికులు పూజలు నిర్వహించారు. అలాగే పూలతో స్వాగతం పలికారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా పాదయాత్రకు స్వాగతం పలికారు.
రాజధాని రైతుల యాత్ర అక్టోబర్ 9న ఆదివారం పాలకొల్లు నుంచి పెనుగొండ వరకు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని మహిళలను ప్రశ్నించారు. తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఒక మహిళ చెప్పింది. దీన్ని మరో మహిళ వీడియో తీసింది. ఇది గమనించిన నిమ్మల ఆ మహిళ వద్ద బలవంతంగా సెల్‌ఫోన్ లాక్కున్నారు.
ఆ దృశ్యాలను తొలగిస్తానని.. తన సెల్‌ఫోన్ తనకు ఇవ్వాలని ఆ మహిళ ప్రాథేయపడింది. అయితే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మహిళ వద్ద లాక్కున్నా సెల్‌ఫోన్‌ను పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు ఇచ్చారు. దీంతో ఆ మహిళ తన ఫోన్ కోసం ఎమ్మెల్యే మెడలోని పచ్చకండువాను, చొక్కాను పట్టుకుని గట్టిగా లాగింది. దీంతో ఎమ్మెల్యే నిమ్మల ఆమెపై కేకలు వేశారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని.. అందుకు ఈ సంఘటన ఉదాహరణ అని చెబుతున్నారు.
మరోవైపు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం కవిటం లాకుల వద్ద కూడా ట్రాఫిక్ ఆగిపోవడంతో ఒక ప్రయాణికుడు.. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ మంత్రి పితాని సత్యనారాయణలపై మండిపడ్డాడు. మీ పాదయాత్రలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తప్పుబట్టాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.