సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించారని. ఎక్కడా తట్టెడు మట్టి కూడా వేయడం లేదనేవిమర్శలు ఉన్నాయి. అయితే.. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే.. ఏ ముఖ్యమంత్రికైనా.. తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. తనకు చెందిన సొంత జిల్లా మరో ఎత్తు. దీంతో అంతో ఇంతో ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకు ఆయన సేవ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ, ఏపీలో ఇదంతా రివర్స్. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి.
వాస్తవానికి జగన్ పాలనలో కడప నగరం అభివృద్ధిలో బుల్లెట్‌లా దూసుకెళుతుందని ఇక్కడి ప్రజలు భావించారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పార్కులు.. ఇలా ఒకటేంటి అన్ని వసతులు సమకూర్చి నెంబర్ వన్ సిటీగా ఉంటుందని ఆశించారు.
అయితే అభివృద్ధి అంతా కాగితాలకే పరమితమైంది. వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్ల కడప నేతలు గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు. మూడేళ్లుగా ఇదే తంతు. ఒకే ఒక్క రోడ్డు మాత్రం పూర్తి చేశారు. మిగిలిన అభివృద్ధి పనులన్నీ కాగితాలకు, ప్రకటనలకే పరిమితం అయ్యాయి.
వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి అయింది. ఇంకా అభివృద్ధి పనులకు డీపీఆర్ కోసం కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడు టెండర్లు పూర్తిచేసి ఆ పనులు మొదలు పెట్టి పూర్తి అయ్యే సరికి పుణ్యకాలం పూర్తి అవుతుంది. ఈ మూడేళ్ల పాలనలో కడప అభివృద్ధి కాగితాల్లో మాత్రమే ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి పనుల కోసం వేసిన శిలాఫలకాల పనులే ఇంతవరకు పూర్తి కాలేదంటే ఇక పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. కడప కార్పొరేషన్ మాత్రమే కాదు.. జిల్లా కేంద్రంలో కూడా పరిస్థితి ఇలానే ఉండడం గమనార్హం.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది జూలై 8న కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రహదారుల విస్తరణ, వర్షపు నీటి కాలువలు, దేవునికడప చెరువు సుందరీకరణ పనులు, రాజీవ్‌మార్గ్ పనులకు శిలాపలకాలు వేశారు.
ఏడాది దాటినా ఇవేవీ ఇప్పటికీ పూర్తి కాలేదు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో దేవునికడప అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. రూ.55 కోట్లు కేటాయించారు. అయితే ఏడాదిగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. టెండర్లు పూర్తి అయ్యాయి. ఇంత వరకు పనులే మొదలు కాలేదు. ఇది ఎప్పుదు మొదలు పెడతారో చూడాల్సి ఉంది. ఇలా కడప అభివృద్ధి అంతా కాగితాల్లో మాత్రమే కనిపిస్తుండడంపై ప్రజలు నవ్విపోతున్నారు.