పాక్ అక్రమిత కశ్మీర్ లో డాగ్రన్ దరిద్రపుగొట్టు పని
తనతో సరిహద్దును పంచుకునే ఏ దేశాన్ని వదలకుండా వ్యవహరించే దేశాల్లో చైనా నిలుస్తోంది. ప్రతి దేశంతోనూ ఏదో ఒక పంచాయితీ పెట్టుకునే డ్రాగన్ దేశం.. భారత్ ను ఇరుకున పడేసేందుకు వీలుగా చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఈ మధ్యనే ఈ దేశం చేసే దారుణాల గురించిన వివరాలు బయటకు వస్తున్నాయి. పాక్ ను స్నేహితుడి పేరుతో దగ్గరకు తీసుకొని.. అవసరమైన ఆయుధాల్ని సరఫరా చేయటం.. కొన్నింటిని బహుమతి పేరుతో దాయాదికి ఇవ్వటం ద్వారా.. భారత్ ను ఇరుకునే పడేలా ప్లానింగ్ చేస్తోంది.
దాదాపు 40 మందికి పైగా చైనా సైనికులు పాక్ అక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్న వైనాన్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మొత్తం 40 మంది డ్రాగన్ సైనికులు ఐదారుగురు ఒక టీం చొప్పున విడిపోయి.. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అక్కడి ప్రజల మైండ్ సెట్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. అక్కడ అత్యాధునిక గ్రామాల్ని నిర్మించేందుకు వీలుగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
దీని ద్వారా అవసరానికి అనుగుణంగా సైనిక.. పౌర అవసరాలకుఈ ప్రాంతాల్ని వాడేలా ప్లానింగ్ చేస్తున్నారు. భారత సరిహద్దు బాధ్యతల్ని చైనాలోని పశ్చిమ కమాండ్ చూసుకుంటోంది. దీనికి కమాండర్ గా వాంగ్ హెజాంగ్ ను నియమించారు. అంతే కాదు.. చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ లోనూ పాక్ కు చెందిన కర్నల్ ర్యాంక్ అధికారిని నియమించినట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాలకు చెందిన నిఘా వర్గాలు సేకరించే రహస్య సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం.
చైనా సైన్యం దాడులు చేయటానికి.. శిక్షణ.. ప్లానింగ్.. వ్యూహాల తయారీ బాధ్యతను సెంట్రల్ మిలటరీ కమిషన్ దేనని చెబుతున్నారు. ఇదిలా ఉండగా చైనాలోని పాక్ దౌత్య కార్యాలయంలో దాదాపు 10 మంది పాక్ సైనిక అధికారుల్ని డిఫెన్స్ అటాచీలుగా నియమిస్తోంది. చైనా -పాక్ ఎకనామిక్ కారిడార్ రక్షణ కోసం 9వేల మంది సైనికులు.. 6వేల మంది పారామిలటరీ సిబ్బందితో ఒక దళాన్ని ఏర్పాటు చేసినట్లుగా పాక్ కు చెందిన అగ్ర మీడియా సంస్థ వెల్లడించటం గమనార్హం. మొత్తంగా భారత్ ను ఇబ్బందికి గురి చేయటానికి వీలుగా ఉన్న ఏ అవకాశాన్ని చైనా వదలట్లేదన్న విషయం తాజా ఉదంతంతో బయటకు వచ్చినట్లుగా చెప్పాలి.
చైనా దుర్మార్గపు బుద్ధిని ముందునుంచి గమనిస్తున్న భారత్.. పాక్ తో సహా ఈ రెండు దేశాల్ని ఏకకాలంలో ఎదుర్కొనేందుకు వీలుగా ‘టూ ఫ్రంట్ వార్’ పేరుతో వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. తాజాగా భారత సైనికాధికారులు కొత్త విషయాన్ని గుర్తించారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సిబ్బంది పాక్ అక్రమిత కశ్మీర్ సరిహద్దు చెక్ పోస్టులు.. గ్రామాల్లో రహస్య సర్వేను నిర్వహించిన వైనం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్ని భారతీయ దళాలు తెలుసుకోవటమే కాదు.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కు వీలుగా వ్యవస్థను సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు.