అదృష్టం ఉండాలే కానీ.. నిద్ర పోతున్నోడిని లేపి మరీ అందలానికి ఎక్కించే గుణం ఉంటుంది. తాజా ఉదంతాన్ని చూస్తే ఇది నిజమనిపించకమానదు. నిరుపేద కూలీ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావటం సాధ్యమా? అంటే నో.. అంటే నో అనేస్తాం. కానీ.. ఇతగాడి ఉదంతం వింటే.. లక్ ఉండాలే కానీ.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావటం ఖాయమనిపించక మానదు.
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాకు చెందిన మోతీలాల్ ప్రజాపతి అనే 30 ఏళ్ల కూలీ ఉండేవాడు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతుకుబండి లాగిస్తుంటాడు. తాజాగా అతగాడు గుంత తవ్వే పని చేస్తున్నప్పుడు ఒక రాయి దొరికింది. ఎందుకో అనుమానం వచ్చి తనిఖీ చేయిస్తే.. అరుదైన వజ్రమన్న విషయం బయటకు వచ్చింది.
అంతే.. నిరుపేద కూలీ కాస్తా రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. అరుదైన వజ్రం ఒకటి అతనికి లభించింది. దాని బరువు 42.9 క్యారట్ల వజ్రంగా గుర్తించారు. ఇంత పెద్ద వజ్రం గతంలో అంటే.. 1961లో లభించింది. అది 44.55 క్యారట్లు అయితే.. ఈసారి దానికంటే కాస్త చిన్నవజ్రం లభించింది.
బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ కోటిన్నరకు పైనే ఉంటుందని చెబుతున్నారు. ఇలా అనుకోకుండా లభించే వజ్రాన్ని ప్రభుత్వం తీసుకొని వేలం వేస్తారు. ఆ వచ్చిన మొత్తంలో రాయల్టీ పోగా మిగిలిన మొత్తాన్ని మోతీలాల్ కు అందజేస్తారు. ఇప్పటికే అప్పులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మోతీలాల్‌కు వజ్రం పుణ్యమా అని అతని ఆర్ధిక పరిస్థితి మొత్తం మారిపోనుంది. అతగాడికి లభించిన వజ్రం కారణంగా ప్రభుత్వానికి వెళ్లాల్సింది వెళ్లగా.. మోతీలాల్ కు నికరంగా కోటిన్నర రూపాయిల వరకూ లభిస్తుందని చెబుతున్నారు. అదృష్టం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా?