ఇటీవలి కాలంలో కళావిహీనంగా మారుతున్న ఐటీ, ఐటీ అనుబంధ రంగం మరో దుర్వార్తను వినాల్సివచ్చింది. ఈ దఫా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలోనో లేదా ఆటోమేషన్ వల్లనో కాదు..సాక్షాత్తు కేంద్ర ఐటీ శాఖ వల్ల. దాదాపు 10వేల కోట్ల పన్ను చెల్లించాలని ఐటీ శాఖ ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది. సర్వీసు ట్యాక్స్ కట్టాలంటూ ఇప్పటి వరకు 200 పైగా ఐటీ కంపెనీలకు సర్వీసు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. ఈ పరిణామం ఐటీ కంపెనీలకు వణికిస్తోంది.
2012-2016 కాలంలో విదేశాలకు సాఫ్ట్‌వేర్ ను ఎగుమతి చేసి పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాలని సేవా పన్నుల శాఖ ఐటీ సంస్థలకు నోటీసులు జారీ చేసిందని సమాచారం. కేవలం పన్నే కాకుండా ఆలస్యం చేసినందుకు వడ్డీ - జరిమానా కూడా కట్టాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఐటీ సంస్థలు ఎగుమతి ప్రయోజనాలకు అర్హులు కావని, కచ్చితంగా సేవా పన్ను కట్టాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ పేర్కొందని ఇది తమకు షాక్ వంటి పరిణామమని ఐటీ వర్గాలు వాపోతున్నాయి. ఓ కంపెనీకి అయితే ఏకంగా రూ.175 కోట్ల పన్ను చెల్లింపు నోటీసు వచ్చినట్లు సమాచారం.
కాగా, ముందస్తుగా కనీసం 10 శాతం పన్ను కట్టకపోతే కోర్టులో కట్టకపోతే అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కూడా అప్పీల్ చేసే అవకాశం ఉందడని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం తప్పనిసరి అని పేర్కొంటున్నారు.