అన్నాడీఎంకే అధినేత్ర జయలలిత మరణం అనంతరం పార్టీని గుప్పెట్లోకి తీసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కన్న చిన్నమ్మ శశికళకు మరో షాక్ తగలనుందని వార్తలు వెలువడుతున్నాయి. మొదట శశికళ - ఆ తర్వాత ఆమె అక్క వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ టార్గెట్ గా సాగిన ఆపరేషన్ ఇప్పుడు చిన్నమ్మ ఆస్తుల మీద పడినట్లు తెలుస్తోంది. మన్నార్ గుడి మాఫియాగా పేరొందిన చిన్నమ్మ కుటుంబాన్ని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయ్యడానికి ఢిల్లీ వేదికగా వ్యూహరచనలు సాగుతున్నాయని అంటున్నారు. శశికళ బినామీలను టార్గెట్ చేసుకుని త్వరలో మరిన్ని ఆదాయపన్ను శాఖ దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయిన చిన్నమ్మకు భారీ స్థాయిలో అక్రమాస్తులు ఉన్నాయని ఐటీ శాఖ భావిస్తున్నట్లు తమిళనాడులో చర్చ జరుగుతోంది. ఇవన్నీ శశికళ కుటుంబ సభ్యులతో పాటుగా పలువురి బినామీల పేరుతో ఉన్నట్లుగా ప్రచారం అవుతోంది. అనేక సంస్థలు - మాల్స్ - సినిమా థియేటర్లు - వ్యాపారాలు ఉన్నాయని గతంలో తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. తమిళనాడుతో సహ ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక - తెలంగాణ - కర్ణాటకలో శశికళకు బినామీ ఆస్తులు ఉన్నాయని, జయలలితను అడ్డం పెట్టుకుని శశికళ ఆస్తులు సంపాదిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శశికళ బినామీ ఆస్తుల వివరాలను ఐటీ శాఖ అధికారులు సేకరిస్తున్నారని తెలిసింది.
చిన్నమ్మ అక్రమాస్తులను తేల్చడంలో పడ్డ ఢిల్లీ పెద్దలు ఇప్పటికే శశికళకు చెందిన అనేక అక్రమ ఆస్తుల వివరాలు పరిశీలిస్తున్నారని సమాచారం. తమిళనాడు ప్రభుత్వ పర్యవేక్షణలోని టాస్మాక్ వైన్ షాప్ లకు భారీ మొత్తంలో మద్యం సరఫరా చేస్తున్న మిడాస్ లిక్కర్ కంపెనీ - జాజ్ సినిమాస్ - ఓ దినపత్రిక - జయ టీవీ తదితర ఆస్తులు శశికళ బినామీ పేర్లతో ఉన్నాయని, అందులో ఆమెకు ఎన్ని షేర్లు ఉన్నాయి, మిగిలిన షేర్లు ఎవరిపేరుతో ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారని అంటున్నారు. కేవలం ఆస్తుల గురించి ఆరా తీయడమే కాకుండా ఆమె మనుషులపై సైతం కన్నేసి పెట్టారని అంటున్నారు. శశికళ భర్త నటరాజన్, శశికళ సోదరుడు దివాకరన్, శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమాస్ సీఈవో వివేక్ - శివకుమార్ - వెంకటేష్ - అనురాధ తదితరుల మీద ఐటీ శాఖ అధికారులు నిఘా వేశారని, ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని తమిళ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/