స్విస్ లో పెరిగిన భారతీయుల సొమ్ము.. 50 శాతానికి పైగా..

Update: 2022-06-18 00:30 GMT
అత్యధికంగా.. అపరిమితంగా సంపాదించిన డబ్బును కొందరు ఇతర దేశాల్లో దాచుకుంటారు.. అక్రమ సంపాదను కూడా ఇందులో భద్రపరుచుకుంటారు.. ఇలాంటి నగదుకు స్విస్ బ్యాంక్ కేరాఫ్ గా నిలుస్తుంది. స్విట్జర్లాండ్ లో ఉన్న ఈ బ్యాంకులో భారత్ కు చెందిన చాలా మందికి ఖాతాలున్నాయి.. అందులో లక్షల కోట్ల నల్లధనం దాగి ఉంది.. ఇందులో ఎంత డబ్బైనా దాచుకోవచ్చు.

అందుకు సంబంధించిన వివరాలు బ్యాంకు ఇతరులకు చెప్పదు.. అందుకే ఈ బ్యాంకును ఎక్కువగా నమ్ముతారు.. తాజాగా ఈ బ్యాంకులో భారతీయులకు సంబంధించిన నగదు నిల్వలు విపరీతంగా పెరిగాయట. 2021 లెక్కల ప్రకారం భారతీయుల సొమ్ము రూ.30,55 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

ఈ బ్యాంకులో ఇండియాకు చెందన నల్లధనం చాలా ఉందని ప్రభుత్వాలకు తెలుసు. గత ఎన్నికల్లో ఇక్కడి నల్లధనాన్ని తీసుకువస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. దానిని తేవడం అటుంచితే.. ఆ నిల్వలు పేరుకుపోవడం చూస్తే దేశంలో ఏ రేంజ్ లో అవినీతి పెరిగిపోతుందో అర్థమవుతుంది.

స్విస్ బ్యాంకులో ఇప్పుడున్న డబ్బు 14 సంవత్సరాల గరిష్టానికి చేరిందని ఆ బ్యాంకు లెక్కల్లో తేలింది. అయితే ఈ బ్యాంకు వివరాలు తెలిపింది ఖాతాదారుల సొమ్మ మాత్రమే. ఇంకా అనధికారికంగా.. వివిధ దేశాల పేర్లతో భారతీయుల సొమ్మ రెట్టింపే ఉండొచ్చని అంటున్నారు.

స్విట్జర్లాండ్ బ్యాంకులో 96 దేశాలకు చెందిన 33 లక్షల ఖాతాదారులు ఉన్నారు. ఇందులో ఇండియా టాప్ 3 ప్లేసులో ఉంది. గతంలో  ఈ బ్యాంకులోని ఖాతాదారుల వివరాలను గోప్యంగా ఉంచారు. కానీ ప్రస్తుతం ఆ వివరాలను బ్యాంకు బయటకు తెలుపుతోంది. కానీ బ్యాంకులో ఎవరి పేరిట ఎంత సొమ్ము ఉందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలుపదు. దీంతో కొందరు అక్రమంగా సంపాదించిన డబ్బంతా ఈ బ్యాంకుకు తరలిస్తారు. అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటారు.

ప్రతీసారి ఎన్నికల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకు నుంచి నల్లధనాన్ని తీసుకువస్తానని హామీ ఇస్తున్నారు. కానీ ఆ తరువాత వాటి గురించి మరిచిపోతున్నారు. గతంలో అక్కడి నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని మామీ ఇచ్చాడు. ఎనిమిదేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొందరు తమ డబ్బును స్విస్ లో మరింత పోగు చేశారు.

ఇలా ఒక్క ఏడాదే 50 శాతం నగదు రెట్టింపవడం విశేషం. ప్రస్తుతం 30 వేల కోట్ల రూపాయలు పెరగడం చూస్తే ఎంత మంది ఖాతాదారుల డబ్బు జమ అయిందో తెలుసుకోవచ్చు. దేశానికి చెందని కొందరు వ్యక్తులు, సంస్థలు ఇతర పేపర్ వాల్యూ ప్రకారం చూస్తే 3.83 బిలియన్ల స్విస్  ప్రాంక్ లు ఉన్నట్లు ప్రకటించింది. 2020లో రూ.20,700 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 10 వేల కోట్లకు పెరిగింది.
Tags:    

Similar News