పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరుంటారో చెప్పాలంటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విసిరిన ఛాలెంజ్ హస్తం పార్టీపై ఒత్తిడి పెంచేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేస్తున్నా లోకల్ జనాలు ఇదే విషయాన్ని అడుగుతున్నారట. ఆప్ అధికారంలోకి వస్తే భగవంత్ మాన్ సీఎం అభ్యర్థిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పటి నుండి ఇదే విషయమై కాంగ్రెస్ నేతల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నేతల్లో మెజారిటీ చరణ్ జీత్ సింగ్ చన్నీకే మద్దతుగా నిలబడ్డారు. అధిష్టానం కూడా చన్నీవైపే ఉంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చన్నీని ప్రకటిస్తే ఏమి కొంపముణుగుతుందో అని టెన్షన్ పడుతోంది. కారణం ఏమిటంటే పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా సీఎం రేసులో ఉన్నారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ తర్వాత అధిష్ఠానం తననే సీఎంగా ప్రకటిస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా చన్నీని ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, దళితుల ఓట్ల కోసమే అధిష్టానం చన్నీని సీఎంను చేసింది. పంజాబ్ లో దళితుల ఓట్లు చాలా ఎక్కువగా ఉంది. అంటే అధిష్ఠానం ఆలోచన కరెక్టే. కానీ దాన్ని సిద్ధూ అంగీకరించటం లేదు.
ఇపుడు కూడా చన్నీపై ఎక్కడ అవకాశం వస్తే అక్కడల్లా సిద్ధు విరుచుకుపడుతున్నారు. టికెట్ల పంపిణీలో కూడా సిద్ధూ కంపు చేసేస్తున్నారు. అధికారం కోసం పోటీ కాంగ్రెస్-ఆప్ మధ్యనే అని సర్వేల్లో తేలిపోవటంతో సిద్ధూ కంపుచేయటం మరింత ఎక్కువైపోయింది. అందుకనే చన్నీయే తమ సీఎం అభ్యర్థి అని అధిష్టానం ప్రకటించటానికి భయపడుతోంది. దాన్ని సిద్ధూ అడ్వాంటేజ్ గా తీసుకుని చన్నీని బాగా ఇబ్బందులు పెడుతున్నారు.
ఈ మధ్య రాహుల్ సన్నిహిత మిత్రుడు నిఖిల్ అళ్వా వ్యక్తిగత హోదాలో పంజాబ్ సీఎం ఎవరో తెలుసుకునేందుకు ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. ఈ పోల్లో కూడా మొదటి ప్లేస్ లో చన్నీయే నిలిచారు. అయినా పేరును ప్రకటించటానికి ఢిల్లీ నాయకత్వం వెనకాడుతోంది. దీన్ని ఆప్ అడ్వాంటేజ్ గా తీసుకుని కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా జనాల్లో ప్రచారం చేస్తోంది. మొత్తానికి సీఎం అభ్యర్థి అనే విషయంలో అన్ని వైపుల నుండి కాంగ్రెస్ పై ఒత్తిడి పెరిగిపోతున్నది మాత్రం వాస్తవం.