ఈ చెప్పుతో కొట్టండి..అభ్యర్థి వినూత్న ప్రచారం

Update: 2018-11-23 10:43 GMT
తెలంగాణ ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కుప్పిగంతులు వేస్తున్నారు. నవరసాలను పండిస్తున్నారు. వినూత్నంగా ప్రచారం చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు.

ప్రధాన పార్టీలకు మేనిఫెస్టో ఉంటుంది.. అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెబుతారు.. మరి ఇండిపెండెంట్ అభ్యర్థుల పరిస్థితి ఏంటీ.? అందుకే ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేపడుతున్నాడు. తన రాజీనామా పత్రాలు - చెప్పులు చేత పట్టుకొని ఇంటింటీకి తిరుగుతున్నారు. ఆయనే జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆకుల హన్మాండ్లు.  తనను గెలిపించాలని కోరుతూనే.. గెలిచాక హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలో కూడా ప్రజలకు వివరిస్తున్నాడు.

కోరుట్ల నియోజకవర్గంలో ఇంటింట తిరుగుతున్న ఆకుల హన్మాండ్లు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తనను చెప్పుతో కొట్టి మరీ పనిచేయించుకోవాలంటూ ఓటర్లకు ఆకుల హన్మాండ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రం - రాజీనామా పత్రంతో పాటు చెప్పులు కూడా పంచుతున్నారు. తన పనితనం నచ్చకపోతే తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీకి పంపించి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఎవరైనా రద్దు చేయించొచ్చంటూ వివరిస్తున్నారు. 70 ఏళ్లుగా మోసపోయారని.. ఇకపై అలా జరగకుండా ఉండాలంటే స్వతంత్ర అభ్యర్థి అయిన తనను గెలిపించాలని హన్మాండ్లు ఇలా చెప్పులు చేతబట్టి ప్రచారం చేయడం ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News