టీఆర్ ఎస్‌ కు ఇంకో ఎమ్మెల్యే మ‌ద్ద‌తు..కేటీఆర్ వ‌ల్లే!

Update: 2018-12-13 04:18 GMT
తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయ‌బోతున్న టీఆర్ ఎస్‌ పార్టీ త‌న‌దైన శైలిలో దూకుడుగా ముందుకు సాగుతోంది . ఇప్ప‌టికే టీఆర్ ఎస్ నుంచి 88 మంది అభ్య‌ర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనికి కొన‌సాగింపుగా ఇండిపెండెంట్ల‌కు సైతం టీఆర్ ఎస్ త‌న‌వైపు ఆక‌ర్ష్ వ‌ల వేస్తోంది. ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌టి రోజే - రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన కోరుగంటి చందర్ టీఆర్ ఎస్‌ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన చందర్.. టీఆర్ ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారు.

అయితే, బుధ‌వారం సాయంత్రం మ‌రో ఎమ్మెల్యే త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రాములు నాయక్ ఈ రోజు హైదరాబాదులో కేటీఆర్‌ ను కలిశారు. ఆయన టీఆర్ ఎస్‌ లో చేరనున్నారని సమాచారం. ఇదే నిజమయితే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను గులాబీ గూటికి చేర్చిన ఘ‌న‌త టీఆర్ ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ ఖాతాలోనే ప‌డింద‌ని అంటున్నారు.

కాగా, ఈ ఇద్ద‌రు స్వ‌తంత్ర్య ఎమ్మెల్యేతో కలిపి టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90 కి చేరనుంది. ఇదే స‌మ‌యంలో మ‌రింత మంది టీఆర్ ఎస్‌ లో చేర‌నున్నార‌ని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ప్ర‌క‌టించారు. టీఆర్ ఎస్ ఎల్పీ స‌మావేశం సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News