హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఇండిపెండెంట్ ల షాక్?

Update: 2021-11-02 10:13 GMT
అనుకున్నట్టే జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీఆర్ఎస్ భయపడ్డదే నిజమైంది. కారును పోలిన గుర్తులకు కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆ ఓట్లన్నీ టీఆర్ఎస్ వే. ఈటల రాజేందర్ మెజార్టీ అన్ని ఓట్లు కారును పోలిన గుర్తులకు పడ్డాయి. దీంతో ఈ గుర్తులు టీఆర్ఎస్ ఓటమికి దారితీస్తున్నాయా? అన్న చర్చ మొదలైంది.

టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన రొట్టెల పీట గుర్తుకు 112 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఈటల రాజేందర్ మొదటి రౌండ్ లో 166 ఓట్ల మెజారిటీ సాధించాడు. అంటే ఆ రొట్టెల పీట 112 ఓట్లు కనుక టీఆర్ఎస్ కు పడితే టీఆర్ఎస్ లీడ్ లోకి వచ్చేది.. ఈటెల వెనుకబడి పోయేవాడు. ఇఫ్పుడు ఈ గుర్తులే టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో శరాఘాతంగా మారాయి.

కారు గుర్తును పోలి ఉన్న రొట్టెల పీట గుర్తు తమకు నష్టం కలిగిస్తున్నట్టుగా టీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ రొట్టెల పీట, రోడ్డు రోలర్ గుర్తులను చూసి భయపడింది. ఆ భయం ఇప్పుడు నిజమైంది. రొట్టెపీట గుర్తుకు మొదటి రౌండులో 112 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

గత దుబ్బాక, ఎంపీ ఎన్నికల్లో కూడా రొట్టెల పీట, రోడ్డు రోలర్ గుర్తులు టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. హుజూరాబాద్ మొదటి రౌండ్ లోనే రొట్టెల పీటకు 112 ఓట్లు వస్తే మిగతా రౌండ్స్ లో రొట్టెల పీట ప్రభావం ఎంత ఉంటుందోనన్న ఆందోళన టీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.
Tags:    

Similar News