పాక్‌ పై అణ్వ‌స్త్ర దాడికి సిద్ధ‌మైన భార‌త్‌ !

Update: 2017-03-22 04:47 GMT
పొరుగునే ఉండి ప‌క్క‌లో బ‌ల్లెంలాగా మారిన పాకిస్తాన్ విష‌యంలో అవ‌స‌ర‌మైతే దూకుడుగా వెళ్లేందుకు సిద్ధ‌మైంది. ఏకంగా అణ్వ‌స్త్ర దాడుల‌కు సైతం ఏ మాత్రం వెనుకాడ‌బోద‌ని సంకేతాలు అందించేందుకు ముందుకుసాగుతున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ అణు వ్యూహకర్త ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. పాకిస్తాన్ తమపై అణు దాటికి పాల్పడే అవకాశం ఉందన్న స్పష్టమైన సంకేతాలు అందితే  భారత్ ముందస్తుగా ఈ తరహా దాడులకు దిగే అవకాశం ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు. తమంతట తాముగా దాడులకు దిగబోమన్న విధానానికి ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో భారత్ స్వస్తి పలికే అవకాశం ఎంతైనా ఉందని మసాచుసెట్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన విపిన్ నారంగ్ తెలిపారు. అయితే భారత్ జరిపే దాడులు పాక్ అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని సాగేందుకూ ఎంతైనా అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.

ఇటీవ‌ల త‌లెత్తిన కొన్ని ప‌రిణామాల గురించి విపిన్ నారంగ్ విశ్లేషిస్తూ మామూలుగా జరిగే ప్రతీకార దాడుల మాదిగా పాక్‌లోని పట్టణ కేంద్రాలు, సంప్రదాయక లక్ష్యాలపై భారత్ గురి పెట్టే అవకాశం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌ కు ముందుగా దాడిచేసే అవకాశాన్ని భారత్ ఇవ్వక పోవచ్చునన్నారు. అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేసేందుకు వీలుంటుందని చెప్పడానికి కారణం పొరుగు దేశం అణు శక్తిని నిర్వీర్యం చేయడమేనని..ఈ తరహా దాడులు తమ కేంద్రాలపై జరుగకుండా నిరోధించడమేనని విపిన్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News