మనదేశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్ యార్ ఖాన్ మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇండియన్ టీమ్ తమ వాళ్లను చూసి భయపడుతున్నదని షహర్ యార్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించకపోవడంపై బీసీసీఐని కూడా తప్పుబట్టారు. `ఇండియన్ టీమ్ మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని చాలెంజ్ చేస్తున్నాం. వాళ్లు ఆడరు. మా టీమ్ ను చూసి భయపడుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో ఆడతాం కానీ.. బయట మాత్రం ఆడబోమని వాళ్లు చెబుతున్నారు` అని షహర్ యార్ ఖాన్ విమర్శించారు.
చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ టీమ్ కు ప్రధాని షరీఫ్ ఇచ్చిన విందులో షహర్ యార్ ఖాన్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశాడు. సాధ్యమైనంత త్వరగా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగైతే.. పాక్ క్రికెట్ వృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2012-13 సీజన్ లో చివరిసారి పాకిస్థాన్ తో ఇండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఆ తర్వాత నుంచీ కేవలం ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్ లకే పరిమితమయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన తర్వాత ప్రతి టీమ్ తమతో ఆడాలని అనుకుంటున్నట్లు షహర్‌యార్ అన్నారు. అంతర్జాతీయ టీమ్స్ ఇక పాక్ లో ఆడాలి. ఇప్పుడు పూర్తి భద్రత ఉన్నది. ఇప్పటికే శ్రీలంక - బంగ్లా - వెస్టిండీస్ లతో చర్చిస్తున్నాం అని ఆయన చెప్పారు.