భారతీయులు రికార్డు సృష్టించారు. ప్రపంచంలో ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారు 27 కోట్ల మంది ఉండగా... వారిలో అత్యధికులు భారతీయులే. 1.75 కోట్ల భారతీయులు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్తరించి ఉన్నారు. తర్వాతి స్థానంలో మెక్సికో ఉంది. 1.18 కోట్ల మెక్సికన్లు ప్రపంచ దేశాలకు వలసలు పోయారు. తర్వాతి స్థానంలో చైనా - రష్యాలున్నాయి. మిగతా దేశాల వలసలతో పోలిస్తే మనవాళ్లకు అన్నిదేశాలు అందలం ఎక్కిస్తున్నాయి. మేథోశక్తిలో టాప్ గా నిలుస్తూ వైద్యం - ఐటీ - సాంకేతిక రంగాల్లో మనవాళ్లు దూసుకెళ్లడం వల్ల వేగంగా అన్ని దేశాల్లో విస్తరిస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక ఉపాధిని సృష్టిస్తున్న ఐటీ రంగంలో మన వాళ్లు టాప్ లో ఉండటం దీనికి కారణం అనుకోవచ్చు. ఇక అమెరికా వలసలకు స్వర్గధామంగా నిలుస్తోంది. ప్రపంచంలో 19 శాతం వలసలు ఈ దేశానికే వెళ్తున్నారు. ఖండాల వారీగా చూస్తే ఐరోపా ఖండానికి అత్యధిక వలసలు ఉంటున్నాయి.
మరి విదేశాలకు సరే... మన దేశంలో వలసలు లేవా అనే ప్రశ్నకు ఐరాస సమాధానం ఇచ్చింది. ఇండియా జనాభాలో 0.4 శాతం మంది వలస దారులే. 2019 లెక్కల ప్రకారం 51 లక్షల మంది వలసదారులు మన దేశంలో ఉన్నారు. అయతే...వీరిలో అత్యధికులు పాకిస్తాన్ - బంగ్లాదేశ్ - నేపాల్ నుంచి వచ్చిన వారే. మన దేశపు వలసల్లో 48 శాతం మహిళలు ఉండటం విశేషం. వలసలు వెళ్లడంలో నెం.1 భారతీయులు ఉన్నా... వలసలు స్వీకరించడంలో టాప్ 10 లో మనం లేకపోవడం గమనార్హం.