చైనాకు షాక్.. సరిహద్దుల్లో నిర్భయ్ మిస్సైల్ దించిన భారత్

Update: 2020-09-28 17:33 GMT
భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. రెండు దేశాలు యుద్ధ సామగ్రిని భారీగా మోహరిస్తున్నాయి. తాజాగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లఢక్ సరిహద్దుల్లో చైనా సైన్యం ‘సర్వేష్ టు ఎయిర్ మిసైళ్లు(ఎస్ఏఏం) లను మోహరించింది. దీంతో చైనాకు ధీటుగా భారత్ తాజాగా అత్యాధునిక, సరికొత్త ‘నిర్భయ్ మిస్సైల్’ను తరలించింది.

నిర్భయ్ తోపాటు ప్రఖ్యాత బ్రహ్మోస్, ఆకాష్ (సర్ఫేస్ టు ఎయిర్) మిసైళ్లను ఎల్ఏసీ వద్ద భారత్ మోహరించి చైనాకు షాకిచ్చింది.

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తయారు చేసిన ‘నిర్బయ్ మిసైల్ ’కు నిశ్శబ్ధ విధ్వంస క్షిపణిగా పేరుంది. ఇది టార్గెట్లను ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుందని పేరుంది. 6 మీటర్ల పొడువుండే నిర్భయ్ పరిధి గరిష్టంగా 1000 కిలోమీటర్లు రేంజ్ లో నాశనం చేస్తుంది. టిబెట్ లోని చైనా సైనిక స్థావరాలను ఈ క్షిపణి నాశనం చేయగలదు.

డీఆర్డీఏ ఏడేళ్లుగా పరిశోధన చేసి తయారు చేసిన నిర్భయ్ క్షిపణి సైన్యంలో చేరడంతో భారత సైన్యానికి కొండంత అండ లభించింది. చైనా మిసైళ్లను మోహరించిన వేళ వాళ్లకు షాకిస్తూ నిర్భయ్ ని రంగంలోకి దింపారు. దీంతో చైనా వెన్నులో వణుకుపుట్టేలా భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. నిర్భయ్ క్షిపణులు భారత అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రాలుగా ఉండనున్నాయి.
Tags:    

Similar News