భారత్ - పాక్ యుద్ధంతో ప్రపంచానికి వినాశనమే..

Update: 2019-10-04 08:33 GMT
ఒకరు ఇద్దరు కాదు..ఏకంగా 12.5 కోట్ల మంది.. ఒక్క వారంలో చనిపోతారు.. భారత్-పాకిస్తాన్ ల మధ్యగనుక అణుయుద్ధం జరిగితే వారంలో చనిపోయే వారి సంఖ్య ఇదీ.. ప్రాణ నష్టమేకాదు.. ఆస్తి, పర్యవరణ నష్టాలు అత్యంత దారుణంగా ఉంటాయని అమెరికాలోని కొలొరోడో బౌల్డర్, రట్గర్ యూనివ ర్సిటీ పరిశోధకులు వేసిన అంచనా ఇదీ..

ప్రస్తుతం ఉభయ దేశాల మధ్య 150 అణ్వాస్త్రాలున్నాయని.. అది 2025నాటికి 200 చేరుకుంటాయని.. వాటిని ప్రయోగిస్తే భారత్, పాక్ లే కాదు ప్రపంచానికే వినాశనం తప్పదని పరిశోధకులు హెచ్చరించారు. ఇప్పటికే భారత్ పై అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితి రావచ్చని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు పంపారు. ఈనేపథ్యంలోనే భారత్ కూడా సెప్టెంబర్ 21-23 మధ్య ఒక యుద్ధ సన్నాహాలు నిర్వహించింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు.

2025 వరకు 200 వరకూ అణ్వాయుధాలు కలిగి ఉండే భారత్, పాక్ ల మధ్య యుద్ధం జరిగితే 36 మిలియన్ల టన్నుల మసి వెలువుడుతుందని.. ఇది ప్రపంచం మొత్తం కమ్మేస్తుందని వర్సిటీ పరిశోధకులు తెలిపారు. యుద్ధం వల్లే వచ్చే మసి బూడిద వల్ల సూర్యకిరణాలు 35శాతం తగ్గి 5 డిగ్రీల వరకు ఉష్నోగ్రత తగ్గిపోతుందని హెచ్చరించారు. ఇక వర్షపాతం 30శాతం వరకూ తగ్గుతుందని.. వృక్ష సంపద హరిస్తుందని.. కూరగాయల ఉత్పత్తి 30శాతం తగ్గుతుందని అధ్యయనం తేల్చింది.

 సముద్రాల్లోనూ 15శాతం వరకూ చేపలు, ఇతర ఆహార ఉత్పత్తి పడిపోతుందని అధ్యయనం తేల్చింది. భారత్, పాక్ లే కాదు.. ప్రపంచం మొత్తం కోలుకోవాలంటే కనీసం పదేళ్లకు పైగానే సమయం పడుతుందని హెచ్చరించింది.


Tags:    

Similar News