మారని అమెరికా: అందితే జుట్టు..అందకపోతే కాళ్లు!

Update: 2020-04-08 07:30 GMT
మొన్నటి దాక అమెరికా - భారత్‌ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల పాటు పాల్గొన్నాడు. ఆ సమయంలో భారతదేశంతో తమ దేశం సత్సంబంధాలు కోరుతోందని.. ప్రధాన భౠగస్వామి అని పేర్కొన్నాడు. తమకు చిరకాల మిత్ర దేశం అమెరికా అని ట్రంప్‌ తెలిపారు. ఆ రెండు రోజుల పర్యటనలో భారతదేశాన్ని కీర్తించారు. భారతదేశంలో ఉన్నప్పుడు స్నేహబంధం కావాలని కోరుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించింది. ఈ వైరస్‌ తో మానవ జాతి ప్రమాదం పడింది. కరోనా వైరస్‌ బారిన పడి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ఆయా దేశాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది.

ఈ సమయంలో భారతదేశంలో ఉన్న మందులపై అమెరికా కన్ను పడింది. భారతదేశంలో అధికంగా క్లోరోక్విన్‌ మందు నిల్వలు ఉండడంతో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసి సహాయం కోరాడు. క్లోరోక్విన్‌ మందుపై విధించిన నిషేధం ఎత్తివేసి తమకు అందించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే మొదట ప్రధానమంత్రి నిరాకరించాడు. ప్రస్తుతం భారత్‌ లో కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వైరస్‌ బాధితులు భారీగానే ఉంటుండడంతో వారి వైద్యం కోసం మందులు అందుబాటులో ఉండేలా భారత్‌ వ్యూహం సిద్ధం చేసింది. ఈ క్రమంలో దేశం నుంచి మందులు ఎగుమతి  కాకుండా ఆంక్షలు విధించింది. దీన్ని గమనించడంతో పాటు తమ దేశంలో క్లోరోక్విన్‌ మందు కొరత ఉండడంతో అమెరికా దేశం భారత్‌ సహాయం కోరింది. అయితే దేశావసరాలను దృష్టి పెట్టుకుని తాము నిషేధం ఎత్తివేయాలని ఖరాఖండిగా విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ సమాధానంతో షాక్‌ తిన్న అమెరికా.. తమకు సహాయం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మందు సహాయం నిరాకరిస్తే ప్రతీకార చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ తెలిపాడు. దీంతో భారతదేశం, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా సహాయం ఆశించడం.. లాక్‌ డౌన్‌ తో కరోనా కూడా కొంత నియంత్రణలోకి వచ్చింది. దీంతో మందుల ఎగుమతులపై భారతదేశంలో పునరాలోచించింది. మానవత్వ దృక్పథంతో భారతదేశం మందు ఎగుమతిపై ఆంక్షలు ఎత్తివేసి ఇతర దేశాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో అమెరికా తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సహాయం చేస్తే ఒకలా చేయకపోతే మరోలా వ్యవహరించడం అమెరికా తీరు సరికాదని చెబుతున్నారు. అలాంటి వైఖరితో అంతర్జాతీయ సంబంధాలపై దుష్ప్రభావం పడింది. అమెరికా అహంకార తీరు సరికాదని అంతర్జాతీయ సంస్థలతోపాటు ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. అందుతే జుట్టు అందకపోతే కాళ్లు అనే వైఖరి సరికాదని పేర్కొంటున్నారు. అమెరికా వ్యవహారం పై అంతర్జాతీయ విశ్లేషకులు కూడా మండి పడుతున్నారు. భారత్‌ లాంటి శాంతియుత దేశంతో అమెరికా ఇలాగేనా వ్యవహించేదని ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News