ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్ కు సంబంధించి చాలానే గొప్పలు చెప్పుకుంటాం. అయితే.. ఈ గొప్పల మాటున ఎన్నో చేదు వాస్తవాలు ఉన్నప్పటికి వాటిని బయట పడనివ్వకుండా చేస్తుంటారు. కానీ.. కొన్నిసార్లు ప్రపంచ వ్యాప్తంగా వెల్లడయ్యే నివేదికల పుణ్యమా అని మన లోపాలు.. తప్పులు బయటకు వచ్చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ఇంటర్నెట్ వినియోగంలో మనకు మించిన తోపులు లేరన్నట్లుగా ఫీల్ కావటమే కాదు.. అదే విషయాన్ని పలు నివేదికలు స్పష్టం చేస్తుంటాయి. అయితే.. దీనికి సంబంధించి భారతీయులంతా సిగ్గుపడే వైనం ఒకటి బయటకు వచ్చింది.
ఇంటర్నెట్ వినియోగంలో దూసుకెళుతున్నా.. నెట్ స్పీడ్ లో మనమెంత వెనుకపడి ఉన్నామన్న విషయాన్ని వెల్లడిస్తోంది తాజాగా విడుదలైన నివేదిక. ఊక్లాకు చెందిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా గణాంకాల్ని బయటపెట్టింది. ఆగస్టులో మొబైల్ ఇంటర్నెట్ వేగం మీద 145 దేశాల్లో జరిగిన అధ్యయనంలో భారత్ స్థానం 131వ తేల్చారు.
మరింత దారుణమైన సంగతి ఏమంటే.. మన ఇరుగున ఉండే శ్రీలంక.. పాకిస్థాన్.. చివరకు నేపాల్ కంటే కూడా మనం వెనుకబడి ఉన్నామన్న విషయం షాక్ తినేలా చేస్తుంది. ఇక.. అత్యధిక స్పీడ్ తో నడిచే మొబైల్ ఇంటర్నెట్ దక్షిణ కొరియా సొంతం. ఇక్కడ సగటున 111 ఎంబీపీఎస్ వేగంతో పని చేస్తుంటే. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తొలి స్థానంలో ఉన్న సౌత్ కొరియాతో పోలిస్తే సగం స్పీడ్ లో మాత్రమే ఉండటం. ఆస్ట్రేలియాలో సగటు స్పీడ్ 66.45 ఎంబీపీఎస్ లు మాత్రమే కావటం గమనార్హం.
తర్వాతి స్థానాల్లో ఖతర్.. నార్వే.. యూఏఈలు నిలిచాయి. అగ్రరాజ్యం.. ప్రపంచానికే పెద్దన్న అమెరికా మాత్రం టాప్ టెన్ లో చోటు దక్కించుకోకపోవటం గమనార్హం. ఈ జాబితాలో సగటున 36.23 ఎంబీపీఎస్ వేగంతో 35వ స్థానంలో నిలిచింది. భారత్ తొలి వంద స్థానాల్లోచోటు దక్కించుకోలేదు. మన దగ్గర సరాసరి వేగం కేవలం 10.65 ఎంబీపీఎస్ మాత్రమే. కాకుంటే డౌన్ లోడ్ స్పీడ్ మాత్రం కాస్తంత మెరుగుపడింది.
ఇప్పటివరకూ ఉన్న 9.15 ఎంబీపీఎస్ నుంచి 10.65 ఎంబీపీఎస్ వేగం పెరగటం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. మొత్తం 145 దేశాల జాబితాలో అట్టడుగున తూర్పు తైమూర్ నిలిచింది. భారత్ పక్కనే ఉండే బుల్లి దేశాలైన శ్రీలంక.. పాక్.. నేపాల్ దేశాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మనకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. శ్రీలంకలో 22.04 ఎంబీపీఎస్ వేగంతో 83వ స్థానంలో నిలిస్తే.. పాకిస్తాన్ 13.08 ఎంబీపీఎస్ వేగంతో 118 స్థానంలో నిలిచింది ఇక.. నేపాల్ 10.78 సగటు వేగంతో 130వ స్థానంలో నిలిచింది. ఇంతకంటే సిగ్గుమాలిన విషయం వేరే ఏం ఉంటుంది. గొప్పలు చెప్పుకునే కేంద్ర సర్కారు ఈ గణాంకాలకు ఏమని చెబుతుందన్నది ప్రశ్న.