ఔను. మన పరువు ఘోరంగా పోయింది. అది కూడా దాయాది దేశమైన పాక్ ముందు. ఎందుకంటే...పాకిస్థాన్ కంటే భారత్ వెనుకబడిపోయింది!అవును.. నిజంగానే ఇండియా మన దాయాది పాకిస్థాన్ కంటే వెనుకబడి పోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల సంఘటిత అభివృద్ధి సూచికలో ఇండియా ఏకంగా 62వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో చైనా 26వ స్థానంలో - పాకిస్థాన్ 47వ స్థానంలో ఉండటం గమనార్హం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ తాజా జాబితాను విడుదల చేసింది. ఇక అభివృద్ధి చెందిన దేశాల లిస్ట్ లో నార్వే తొలి స్థానంలో నిలిచింది.
జీవన ప్రమాణాలు - వాతావరణ సమతౌల్యత - అప్పుల భారం నుంచి భవిష్యత్ తరాలను తప్పించే రక్షణ చర్యలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారుచేస్తారు. జీడీపీని దృష్టిలో పెట్టుకొని ఆర్థికాభివృద్ధి సాధించామని చూపడం సరికాదని - సంఘటిత అభివృద్ధినే ప్రామాణికంగా తీసుకోవాలని ఈ సందర్భంగా దేశాధినేతలకు ఫోరమ్ పిలుపునిచ్చింది. గతేడాది 79 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఇండియా 60 - చైనా 15 - పాకిస్థాన్ 52వ స్థానాల్లో ఉండగా.. ఈసారి ఇండియా - చైనా ర్యాంకులు దిగజారాయి. మూడు రంగాలను ప్రామాణికంగా తీసుకొని 103 ఆర్థిక వ్యవస్థలకు 2018 ఇండెక్స్ ర్యాంకులను కేటాయించింది. అందులో 29 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కాగా.. మిగతా 74 అభివృద్ధి చెందుతున్న దేశాలు.
అయితే ర్యాంకు తక్కువగానే వచ్చినా.. సంఘటిత వృద్ధి రేటులో భారత్ అడ్వాన్స్ డ్ కేటగిరీలో ఉండటం ఊరట కలిగించే విషయం. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో నార్వే - ఐర్లాండ్ - లగ్జెంబర్గ్ - స్విట్జర్లాండ్ - డెన్మార్క్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. టాప్ టెన్ లో ఆస్ట్రేలియా తప్ప మిగతావన్నీ యురోపియన్ దేశాలే కావడం విశేషం. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో లిథుయానియా - హంగరీ - అజర్ బైజాన్ - లాత్వియా - పోలాండ్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. బ్రిక్స్ దేశాల విషయానికి వస్తే.. రష్యా(19) తొలి స్థానంలో ఉండగా.. చైనా (26) - బ్రెజిల్ (37) - ఇండియా (62) - సౌతాఫ్రికా (69) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మన పొరుగు దేశాలైన శ్రీలంక (40) - బంగ్లాదేశ్ (34) - నేపాల్ (22) కూడా ఇండియా కంటే ఎంతో మెరుగ్గా ఉండటం గమనార్హం.