మరణాల్లో ఇటలీని దాటేసిన ఇండియా

Update: 2020-07-31 12:30 GMT
దేశంలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 35 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 779 మరణాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఒక్కరోజు 55వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 16.4 లక్షలు దాటాయి. ఇందులో యాక్టివ్ కేసులు 547,726 కాగా, రికవరీలు 1,060,000 ఉన్నాయి. మరణాలు 35,817గా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు 31 మంది మరణించారు.

కరోనా కేసుల్లో, మరణాల్లో భారత్ ఇతర దేశాలను దాటుతోంది. భారత్‌లో 130 కోట్ల మందికి పైగా ప్రజలు ఉంటారు. ఇతర దేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది. ఆ లెక్కన మన వద్ద మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు మరణాల్లో మన దేశం ఇటలీని దాటేసింది. ఇటలీలో ఇప్పటి వరకు 35,132 మంది మృతి చెందగా, ఇండియాలో 35,817 ఉన్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో 4,635,226 కేసులు, 155,306 మరణాలు చోటు చేసుకున్నాయి. కేసుల్లో 2,613,789తో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా భారత్ మూడో స్థానంలో ఉంది. మరణాల్లో అమెరికా, బ్రెజిల్ (91,377), మెక్సికో (46,000), యూకే (45,999), ఫ్రాన్స్ (30,254), స్పెయిన్ (28,443) ఉన్నాయి.
Tags:    

Similar News