వాళ్లు రెచ్చగొడుతుంటారు, కవ్విస్తుంటారు... మనం మాత్రం ఖండిస్తుంటాం, అశాంతి వద్దంటాం! ఇది నిత్యం భారత్ - పాక్ సైన్యం మధ్య జరిగే విషయాలు! పాకిస్థాన్ వాళ్లని నిత్యం సోదరులుగా భావించే మనస్థత్వం భారత్ సొంతం. భారత్ ను నిత్యం ఆజన్మ శతృవులా భావించేది పాక్ నైజం! అయినా కానీ... భారత్ మంచితనం నిత్యం కొనసాగుతూనే ఉంది!
తాజాగా శనివారం రంజాన్ పండగను పురస్కరించుకుని భారత సైన్యం (బీ.ఎస్.ఎఫ్. - బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) పాక్ సైనికులకు మిఠాయిలు ఇవ్వాలని నిర్ణయించుకుని అందించే ప్రయత్నం చేసింది. కానీ... సరిహద్దుల్లో దశాబ్ధాలుగా సాగుతున్న పండగ చెలిమికి చెరమగీతం పాడాలని నిర్ణయించుకున్న పాక్... ఈ మిఠాయిలను తిరస్కరించింది. ప్రస్తుతం వాఘా సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన రెండు దేశాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితి కేవలం వాఘా వద్దే కాకుండా భారత్ - పాక్ అన్ని సరిహద్దు స్థావరాల వద్దా జరగడం గమనార్హం!
కాగా... గత రెండు వారాలుగా పాక్ వీలైనంత వరకూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరుతూనే ఉంది. భారత్ పై కాల్పులు జరుగుపుతూనే ఉంది! దీంతో పాక్ సైనికుల వ్యూహం ఏమైనా ఉందా అనే దిశగా భారత్ సైన్యాధికారులు ఆలోచన చేస్తున్నారు! భారత్ నమ్ముకున్న శాంతి సిద్దాంతాన్ని చేతకానితనంగా భావిస్తే మాత్రం తగిన ప్రతిఫలం పొందక తప్పదనే విషయం పాక్ గ్రహించాలి!