బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆసీస్‌ తో ఆడ‌డానికి మావాళ్లు సిద్ధం

Update: 2020-05-08 14:00 GMT
క‌రోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తుండ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలు ఆగిపోయాయి. ఒలింపిక్స్ గేమ్స్‌‌తోపాటు ఐపీఎల్‌తో పాటు ఇత‌ర క్రీడా కార్యాక‌లాపాల‌న్నీ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ క్రీడా రంగంపై ఊహించ‌ని ప్ర‌భావం చూపింది. అన్ని దేశాల్లో చిన్న చిన్న పోటీలు కూడా నిలిపేసిన ప‌రిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా క‌రోనా విజృంభ‌ణ నియంత్ర‌ణ‌లోకి రాలేదు. అయితే ఇలాంటి స‌మ‌యంలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ బోర్డు (బీసీసీఐ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టుతో భార‌త ఆట‌గాళ్లు సిద్ధమ‌ని ప్ర‌క‌టించింది. ఈ ప‌ర్య‌ట‌నకు వెళ్లేందుకు ఆట‌గాళ్లు రెండు వారాల‌పాటు క్వారంటైన్‌లో ఉంటార‌ని పేర్కొంది. దీంతో స‌ర్వ‌త్రా బీసీసీఐ నిర్ణ‌యంపై ఆస‌క్తి రేపింది.

వాస్త‌వంగా భార‌త క్రికెట్ జ‌ట్టుతో ఆస్ట్రేలియా జ‌ట్టు ఆడాలి. షెడ్యూల్ ప్ర‌కారం ఆస్ట్రేలియాతో జ‌ర‌గాల్సిన ఈ టూర్‌పై నీలిమేఘాలు ఏర్పడిన ప‌రిస్థితులు. అయితే భార‌త్‌ పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చాలా ఆశ‌లు పెట్టుకుంది. ప్ర‌స్తుతం తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ స‌మ‌యంలో భార‌త జ‌ట్టుతో ఆట కోసం ఏకంగా 50 మిలియ‌న్ల డాల‌ర్ల అప్పు చేసి నిర్వ‌హించేందుకు సిద్ధమైంది. ఈ స‌మ‌యంలోనే క‌రోనా వైర‌స్ వ్యాప్తి రావ‌డంతో సీఏ ఆందోళ‌నలో ప‌డింది.

ఈ నేప‌థ్యంలో బీసీసీఐ త‌మ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని, ఈ సంద‌ర్భంగా అక్క‌డ రెండు వారాల పాటు క్వారంటైన్‌ లో త‌మ ఆట‌గాళ్లు ఉంటార‌ని పేర్కొంది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టుకు ఆనందం క‌లిగించే విష‌యం. వాస్త‌వంగా వ‌చ్చే న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియా టూర్ ఉంది. దానిక‌న్నా ముందే ఆస్ట్రేలియాలో టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ ఉంది. అయితే క‌రోనా ప్ర‌భావంతో ఇవ‌న్నీ జ‌రుగుతాయా లేవా? భార‌త నిర్ణ‌యంపై ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News