డ్రాగన్ కంట్రీ మళ్లీ తప్పుడు పనులు మొదలుపెట్టింది. సిక్కిం సెక్టార్ లోని డోక్లామ్ లో సైనిక మోహరింపుకు ప్రాధాన్యత ఇస్తున్న చైనాను ఎదుర్కొనేందుకు భారత దేశం అమెరికాతో చేతులు కలుపుతోంది. డోక్లామ్ లో ప్రస్తుతం చైనా రోడ్డు నిర్మాణం కార్యక్రమం చేపట్టకున్నా దాని చుట్టుపక్కల ప్రాంతంలో పెద్దఎత్తున రోడ్ల విస్తరణను చేపట్టింది. భవిష్యత్తులో డోక్లామ్ లాంటి సంఘటన చోటుచేసుకున్న వెంటనే సైనిక చర్యకు దిగేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోందనే మాట వినిపిస్తోంది. చైనా సైనికులు ఇటీవల పలుమార్లు డోక్లామ్ వద్దకు గస్తీ పేరుతో వచ్చి భూటాన్ సైనికులను బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా దాదాపు 15వేల మంది సైనికులను డొక్లామ్ చుట్టుపక్కల ప్రాంతంలో మోహరించింది. దాంతోపాటు 500 మంది సైనికుల భద్రత మధ్య స్థానిక రోడ్ల మరమ్మత్తు చేపట్టింది.
చైనా పాలకులు దీర్ఘకాలిక వ్యూహంతో డోక్లామ్ చుట్టుపక్కల ప్రాంతంలో రోడ్ల విస్తరణ - పటిష్టం చేసే కార్యక్రమం చేపట్టటంతో భాతర బలగాలు అత్యంత అప్రమత్తతను పాటిస్తున్నాయి. చైనా తాజాగా ప్రారంభించిన కవ్వింపు చర్యల నేపథ్యంలో మన దేశం అమెరికాతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. డోక్లామ్ లో మరోసారి చైనా సైనికుల కార్యకలాపాలు ప్రారంభం కాగానే విదేశీ వ్యవహరాల కార్యదర్శి ఎస్.జయశంకర్ గత మంగళవారం హుటాహుటిన భూటాన్ వెళ్లి ప్రధాన మంత్రి త్శేరింగ్ తోబ్గయ్ తో చర్చలు జరపటం తెలిసిందే. భారతదేశంలో అమెరికా రాయబారి మార్కే ఎల్ కారిసన్ భూటాన్ రాజధాని థింపుకు వెళ్లి త్శేరింగ్ తోబ్గయ్ తో రహస్య మంతనాలు జరిపారు. తోబ్గయ్ ని జయశంకర్ కలిసిన కొన్ని రోజులకే ఆమెరికా రాయబారి కూడా సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే చైనా వేస్తున్న ఎత్తుగడల వ్యవహారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. చైనా దుందుడుకు వ్యవహారాన్ని అదుపు చేసేందుకు భారత - అమెరికా దేశాలు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. డోక్లామ్ లో భారత - చైనా సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ట్రంప్ గత ఆగస్టు నెలలో నరేంద్ర మోడీకి టెలిఫోన్ చేసి పరిస్థితి గురించి తెలుసుకోవటంతోపాటు తమ మద్దతు కూడా ప్రకటించటం తెలిసిందే.
ఇదిలావుండగా ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వటం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, ఇది తమ ఆఖరు హెచ్చరిక అంటూ అమెరికా కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా చేసిన ఈ హెచ్చరికకు చైనా స్పందించటం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదులను అదుపు చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్న కృషిని అమెరికా గుర్తించాలంటూ చైనా ఒక ప్రకటన జారీ చేసింది. పాకిస్తాన్ కు అండగా నిలిచేందుకే చైనా ఈ ప్రకటన చేసిందనేది అందరికీ తెలిసిందే. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ మరోవైపు డోక్లామ్ లో భూటాన్ భూభాగాన్ని అక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని భావిస్తున్న భారతదేశానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తోంది.