ప్రస్తుతం భారతదేశానికి ప్రశాంత లేకుండా చేస్తున్న దేశం పాకిస్థాన్ అయితే.. దానికి కారణం అయిన "భారత భూభాగం" పాక్ ఆక్రమిత కశ్మీర్. ప్రస్తుతం భారతదేశానికి చికాకు తెప్పిస్తున్న పాకిస్థాన్ అప్రకటిత సైన్యం (ఉగ్రవాదులు) శిబిరాలు ఏసుకుని మరీ దర్జాగా బ్రతికేస్తుంది ఇక్కడే. తెలుగు వారికి ఆంధ్ర తెలంగాణ, కన్నడీగులకు కర్ణాటక, తమిళులకు తమిళనాడు లాగా సొంత ప్రాంతంలా ఫీలయిపోతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం అంటే వారి సొంత ప్రాంతంలా చేరిపోయారు ముష్కరులు. దీనికి పాకిస్థాన్ నుంచి పుష్కలమైన సపోర్ట్ లభిస్తుండటంతో ఇక వీరికి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అయితే ఈ విషయాలపై ఒక ఆరు నెలలు గడువిస్తే చాలు... పీఓకే లో ఉగ్రవాది అనేవాడు కనిపించకుండా చేస్తామని చెబుతుందట భారత ఆర్మీ.
ప్రస్తుతం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో ఇదే అవకాశంగా, ఇదే ఊపులో తమకు అవకాశం ఇస్తే ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలను చిత్తు చేస్తామని, వారికి పునరావాసం లేకుండా దెబ్బకొడతామని టాప్ మిలటరీ అధికారులు ఒకరు కొంతమంది కేంద్ర రాజకీయ పెద్దలతో మాట్లాడారు అన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొన్న జరిగిపిన సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఇంకొన్ని జరిపితే ఉగ్రవాదుల తమవైపే రాకుండా చేయొచ్చని వారు తెలిపారట. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సుమారు 50 వరకూ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, వాటిలో ఉన్న ఉగ్రవాదుల్లో ఒక 200మంది వరకూ ఉగ్రవాదులు ఎప్పుడంటే అప్పుడన్నట్లు సిద్ధంగా ఉంటారని, వీరికి పాక్ ఆర్మీ అండగా నిలుస్తుందని సైనికులు సదరు రాజకీయ పెద్దలతో వివరించారట!
కాగా సర్జికల్ దాడులతో అనూహ్యంగా ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ, మొత్తం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మొత్తం ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయాలని అనుకుంటోందట. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కాస్త ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని "ఊ" అంటే ఉగ్రమూకలకు ఇక చెల్లుచీటీనే! అన్నీ అనుకూలంగా జరిగి అదే జరిగితే ఇక ప్రశాంతతే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/