జ‌మ్మూక‌శ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదుల అల‌జ‌డి: కొన‌సాగుతున్న ‌వేట‌

Update: 2020-06-18 12:30 GMT
భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే చైనాతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన స‌మ‌యంలో సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇటు నేపాల్‌లో కూడా అదే వాతావ‌ర‌ణం ఉంది. ఇక దీనికితోడు జమ్ముకశ్మీర్‌లో నిత్యం ఉగ్ర దాడులు క‌శ్మీర్‌ను కొద్దిసేపు కూడా ప్ర‌శాంతంగా ఉండేలా చేయ‌డం లేదు. మూడు నెలలుగా నిత్యం జమ్ముకశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంటుంది. దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం చేస్తున్న ప్రయత్నాలకు భారత సైనికులు అడ్డుకుంటున్నారు.

ఇదే క్ర‌మంలో గురువారం కూడా జ‌మ్మూక‌శ్మీర్ లోయ‌లో ఉగ్ర‌వాదులు పెట్రేగిపోయారు. మరోసారి లోయలో అలజడి సృష్టించారు. దీంతో భార‌త సైనికులు వారిని గాలిస్తున్నారు. సౌత్‌ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా మునాంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నార‌ని పక్కా సమాచారం అందింది. భార‌త ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఉగ్ర‌వాదుల‌ను వేటాడుతున్నాయి. వీరి రాక‌ను గ‌మ‌నించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగ‌బ‌డ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు చేసింది.

ఈ ఘ‌ట‌న‌తో పాటు మరో ఎన్‌కౌంటర్‌ అవంతిపోరా జిల్లాలో చోటుచేసుకుంది. పామ్పోరె ప్రాంతంలోని మీజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన దళాలు.. ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు సమీపంలోని మసీదులోకి చొరబడ్డాడని గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News