భారత సైన్యం పై ఆవు బాంబు?

Update: 2015-08-02 05:08 GMT
వినటానికే గగుర్పాటుకు గురి చేసే అంశం వెలుగులోకి వచ్చింది. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ఇప్పటివరకూ మానవ బాంబుల గురించి తెలిసిందే. కానీ.. మూగజీవాల్ని తమ హింసాత్మక చర్యల కోసం వినియోగిస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది.

భారత సైన్యంపై దాడి చేసేందుకు వేసిన ప్లాన్.. సైనికులు అప్రమత్తంగా ఉండటతో తప్పింది. భారత్.. నేపాల్ సరిహద్దుల్లో సుమారు వంద వరకూ ఆవులు సైన్యం కంట పడ్డాయి. అయితే.. వాటిని కాసే వారు ఎవరూ లేకపోవటంతో కాస్తంత ఆశ్చర్యానికి గురయ్యారు. అదే సమయంలో ఆవుల పొట్టలకు కుట్లు వేసి ఉండటంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

దీనికి తోడు.. ఆవు పొట్టలో నుంచి టిక్ టిక్ అన్న మోత రావటంతో వెంటనే అలెర్ట్ అయిన సైన్యం.. వాటిని జాగ్రత్తగా పరీక్షిస్తే.. వాటి కడుపుల్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పెట్టి కుట్టేసినట్లుగా గుర్తించారు.

వాటిని వేరే క్యాంపునకు తరలించిన సైన్యం.. ఆవులకు ఎక్స్ రేలు.. స్కానింగ్ లు నిర్వహించగా.. వాటి కడుపులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇదంతా భారత సైన్యం మీద అటాక్ చేసేందుకే అన్న నిర్థారణకు వచ్చాయి. అయితే.. ఇది ఎవరి పని అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మూగజీవాలతో సైన్యాన్ని టార్గెట్ చేసుకున్న తీరు భారత సైన్యాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

 
Tags:    

Similar News