జట్టుపై మండిపోతున్న అభిమానులు

Update: 2022-09-07 05:30 GMT
రెండు వరుస మ్యాచుల్లో ఓడిపోయిన భారత క్రికెట్ జట్టుపై అభిమానులు మండిపోతున్నారు. మ్యాచులన్నాక ఏదో ఒక జట్టే గెలుస్తుందన్న స్పృహ అభిమానులకు ఉంది. కాకపోతే గెలవాల్సిన రెండు మ్యాచులను చేజేతులా ఓడిపోవటాన్నే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

రెండు రోజుల క్రితం పాకిస్ధాన్తో జరిగిన మ్యాచులో పేలవమైన ఆటతీరుతో మ్యాచును పోగొట్టుకున్నది. తాజాగా అంటే మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో కూడా పేలవమైన ఆటతీరుతో మ్యాచును పొగొట్టుకున్నది.

గెలవాల్సిన మ్యాచులో ఓడిపోయిన ఫలితంగా ఏషియా కప్ టోర్నమెంట్ నుంచి భారత్ జట్టు బయటకు వచ్చేసింది. మరో నెలన్నరలో టీ20 ప్రపంచకప్ టోర్నమెంటు ప్రారంభమవుతున్న సమయంలో జట్టు మొత్తం ఇంతటి పేవలమైన ప్రదర్శన చేయటమే ఆశ్చర్యంగా ఉంది. చెప్పుకోవటానికి విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, రాహూల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ లాంటి స్టార్ ఆటగాళ్ళున్నారు కానీ అందరు వేస్టే. మొత్తం అందరూ సమిష్టిగా ఫెయిలయ్యారు.

ఇక బౌలర్ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. బౌలర్లలో చాలామంది పదుల సంఖ్యలో మ్యాచులు ఆడారే కానీ మ్యాచ్ గెలవటానికి ఎలా బౌలింగ్ చేయాలో ఎవరికీ తెలీదన్నట్లు ఆడారు. భువనేశ్వర్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ లాంటి బౌలర్లు కూడా పేలవంగా బౌలింగ్ చేశారు.

ఎంతో క్రూషియల్ అనుకున్న ఓవర్లలో కూడా వెడ్లు వేసి, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసి పాకిస్తాన్, శ్రీలంక బ్యాట్స్ మెన్ తో చావకొట్టించుకున్నారు. నేరుగా వికెట్లకు వేయాల్సిన బంతులను కూడా తమిష్టం వచ్చినట్లు షార్ట్ పిచ్చులు లేదా ఓవర్ పిచ్చులు వేయటం ద్వారా ప్రత్యర్ధులకు మ్యాచులను మన బౌలర్లు అప్పగించేశారు.

బ్యాటింగ్, బౌలింగ్ అని కాకుండా అన్ని విభాగాల్లోను మన ప్లేయర్లు ఫెయిలయ్యారు. అసలు ఆగాళ్ళల్లో ఏ ఇద్దరికీ సమన్వయం ఉన్నట్లే కనబడలేదు. ఎంత బాగా ఆడినా ఒక్కోసారి జట్టు ఓడిపోతుంది. దానికి అభిమానులెవరు బాధపడరు. ఎందుకంటే గెలుపుకోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదని సరిపెట్టుకుంటారు. కానీ ఆద్యంతం పేలవమైన బ్యాటింగ్, అత్యంత ఘోరమైన బౌలింగ్ ప్రదర్శనతో చేజేతులా మ్యాచుల్లో ఓడిపోవటాన్నే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News