లోక‌ల్ ట్రైన్‌ లో ఎన్నారై మ‌హిళ‌పై జాత్య‌హంకారం

Update: 2017-02-27 09:28 GMT
అమెరికాలో జాత్యహంకార దాడుల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్న‌టికి మొన్న కాన్స‌స్ లోని ఓ బార్ లో శ్వేత జాతీయుడి తుపాకీ తూటాల‌కు తెలుగు యువ‌కుడు శ్రీనివాస్ బ‌లైపోగా... ఆ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ అలోక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘ‌టన రేపిన భ‌యాందోళ‌న‌లు చ‌ల్లార‌క ముందే... ఆ దేశంలో మరిన్ని జాత్యహంకార దాడులు జ‌రుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని వాణిజ్య రాజ‌ధాని న్యూయార్క్‌ లో వెలుగు చూసిన జాత్య‌హంకార దాడిలో భార‌తీయ మ‌హిళ వేధింపుల‌కు  గురైంది. అమెరికాలోని శ్వేత జాతీయులే జాత్య‌హంకారుల‌న్న భావ‌న‌ను  చెరిపేస్తూ... న‌ల్ల  జాతీయుల‌మైనా తాము కూడా అమెరిక‌న్ల‌మేన‌ని, త‌మ‌లోని జాత్యహంకారం ఉంద‌ని నిరూపించారు అక్క‌డి న‌ల్లోళ్లు.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... న్యూయార్క్‌లోని ఓ లోక‌ల్ ట్రైన్‌ లో ప్ర‌యాణిస్తున్న భార‌తీయ మ‌హిళ‌ను ఇద్ద‌రు న‌ల్ల జాతీయులు  హేళ‌న చేశారు. అంతేకాకుండా ప‌లు విధాలుగా ఆమెపై అస‌భ్య‌క‌ర కామెంట్లు చేస్తూ... త‌మ దేశం విడిచిపెట్టి పోవాల‌ని బెదిరించారు. త‌మ దేశం విడిచిపెట్టి వెళ్ల‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని కూడా ఆమెను తీవ్ర భ‌యాందోళ‌న‌లకు గురి చేసేందుకు య‌త్నించారు. అయితే ఈ జాత్య‌హంకారులను భార‌తీయ మ‌హిళ ధైర్యంగానే ఎదుర్కొన్నారు. వారి బెదిరింపుల‌కు ఏమాత్రం భ‌య‌ప‌డని మ‌హిళ వారు చేసిన ప్ర‌తి కామెంట్‌కు ధైర్యంగా స‌మాధానం ఇచ్చారు.

బాధితురాలి ధైర్యం చూసిన అక్క‌డి కొంద‌రు న‌ల్ల జాతీయుల‌ను అడ్డుకునే య‌త్నం చేశారు. దీంతో మ‌రింత ఆగ్ర‌హానికి గురైన నిందితులు త‌మ‌ను అడ్డుకునేందుకు య‌త్నించిన వారిపై బూతు పురాణం విప్పారు. నోటికొచ్చిన‌ట్లు తిడుతూ అస‌భ్య‌క‌ర సంజ్ఞ‌లు చేస్తూ విక‌టాట్ట హాసం చేశారు. అంతేకాకుండా త‌మ దుశ్చ‌ర్య‌ను చిత్రీక‌రిస్తున్న విష‌యాన్ని గ‌మ‌నించిన నిందితులు కెమెరాకు మ‌రింత ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి... ఎవ‌రికీ కూడా తాము భ‌య‌ప‌డేది లేద‌న్న‌ట్లుగా ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలోకి ఎక్కేసింది. భార‌తీయ న్యూస్ చానెళ్ల‌లోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ ఈ వీడియా వైర‌ల్‌ గా మారింది.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News