ప్రముఖ మ్యాగజైన్ ఔట్ లుక్ తాజా కవర్ పేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. భారత ప్రభుత్వం అదృశ్యం అనే హెడ్ లైన్ తో దీనిని రూపొందించారు. ఏడేళ్ల వయస్సు కలిగిన మోడీ ప్రభుత్వం కనిపించడం లేదని అందులో ప్రస్తావించారు. ఆచూకీ తెలిసిన వారు భారత ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
భారత్ లో కొవిడ్ రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో పడకల లేమితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరైన సమయానికి వైద్యం అందక అసువులు బాస్తున్నారు. అంతేకాదు దేశంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ ఇతర దేశాలను ఎగుమతి చేశారని... ప్రస్తుతం వ్యాక్సిన్ కు తీవ్ర కొరత ఉందని రాజకీయ పక్షాలు ఆరోపించాయి. పలు రాష్ట్రాల్లో కేవలం సెకండ్ డోసు మాత్రమే ఇస్తున్నారు.
లక్షల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాజకీయ పక్షాలు, సామాన్యులు విమర్శిస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం కనిపించడం లేదు అంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేసిన విషయం తెల్సిందే.
కొవిడ్ కాటుతో వేల మంది ప్రాణాలు పోతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పట్ల సామాజిక మాధ్యమాల్లోనూ వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఔట్ లుక్ మ్యాగజైన్ విడుదల చేసిన కవర్ పేజీ వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ఈ కవర్ పేజీకి మిశ్రమ స్పందన వస్తోంది.