రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల మీద ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. గతంలో మాదిరి మాటలు చెప్పటం.. అవగాహన పెంచటం లాంటి కార్యక్రమాలకు స్వస్తి పలికి.. డైరెక్ట్ గా చర్యల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి అడుగే మరొకటి పడింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాంగ్ రూట్ లో వాహనాన్ని నడపటం కారణంగా ప్రమాదాలు భారీగా జరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో ఒక శాతం మరణాలు.. కేవలం రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణం వల్లేనన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
దీనికి చెక్ చెప్పేందుకు వీలుగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం డిసైడ్ అయ్యింది. గతంలో రాంగ్ రూట్ లో వాహనాల్ని నడిపే వారిపై జరిమానా మాత్రమే వేసే వారు. అది కూడా చాలా తక్కువగానే. కానీ.. రోడ్డు ప్రమాదాల్ని అడ్డుకునేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఒకటి రాష్ట్రాలకు సరికొత్త ఆదేశాలు చేసింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు వేస్తే సరిపోదని.. వారికి కఠినంగా శిక్షలు విధించాలని స్పష్టం చేసింది.
మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జైలుశిక్ష విధిస్తున్న తరహాలోనే.. రాంగ్ రూట్ లో వాహనాల్ని నడిపే వారిని అదుపులోకి తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలని కమిటీ నిర్ణయించింది. తాము వెళ్లాల్సిన మార్గానికి భిన్నంగా ఎదురుగా వాహనాలతో వచ్చే వారిపై కేసులు నమోదు చేయటంతో పాటు.. వారికి ఐపీసీ సెక్షన్ 279 కింద ఆర్నెల్లు జైలుశిక్ష వేయాలంటూ సుప్రీంకోర్టు కమిటీ ఒకటి స్పష్టం చేయటం గమనార్హం. అంతేకాదు.. రాంగ్ రూట్ లో వాహనాల్ని నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా రద్దు చేయాలని కమిటీ స్పష్టం చేయటం గమనార్హం. సో.. రాంగ్ రూట్ లో వాహనాల్ని తీసుకెళ్లే అలవాటు ఉన్న వారంతా తమ అలవాటును తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. లేనిపోని ఇక్కట్లకు గురి కావటం ఖాయం.