అమెరికాలో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ట్రంప్ దెబ్బ?

Update: 2020-06-27 23:30 GMT
హెచ్1బీ సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఈ ఏడాది డిసెంబర్ 31వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీంతో అమెరికాకు విదేశీ ఉద్యోగులు రాకుండా బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత ఐటీ కంపెనీలలో ఎంతమంది హెచ్1బీ వీసా ఉద్యోగులు ఉన్నారు? ఎంత మంది స్థానికులున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అమెరికాలోని భారత ఐటీ కంపెనీల్లో దాదాపు 80000 మంది భారతీయులు ఉద్యోగాలుగా వీసాలపై వెళ్లారు. ఇందులో ఎక్కువమంది హెచ్1బీ వీసాదారులే కావడం గమనార్హం.

భారత ఐటీ కంపెనీలైన టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహీంధ్రా, హెచ్.సీఎల్, విప్రో వంటి ఐటీ సంస్థ్లలో దాదాపు 79649మంది భారతీయ ఐటీ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ఒక్క టీసీఎస్ లోనే 54874 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 40శాతం మంది ఉద్యోగులు మంది వీసాపై ఉన్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలపై ఉన్న వారికి ట్రంప్ ఆదేశాలతో ఎలాంటి ప్రభావం లేదు. కానీ రెన్యువల్ ఉన్నవారికి మాత్రం తిరస్కరించి భారత్ కు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

*ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో హెచ్1బీ రెన్యూవల్ తిరస్కరణ రేటు భారీగా పెరిగింది. 2016లో 4శాతం ఉండగా.. 2020లో ఏకంగా 21శాతానికి పెరిగింది.

*ఇక ఇన్ఫోసిస్ లో 28662మంది ఉద్యోగులుండగా.. ఇందులో 40శాతం మంది వీసాలపై ఉన్నారు.

*కాగ్నిజెంట్ లో 54183మంది ఉద్యోగులుండగా 50శాతం మంది వీసాలపై పనిచేస్తున్నారు.

*టెక్ మహీంద్రాలో అమెరికాలో మొత్తం 14687 మంది ఉద్యోగులు ఉన్నారు. వీసాలపై ఉన్న వారు 50శాతం మంది ఉన్నారు.

*విప్రోలో అమెరికాలో 28662మంది ఉద్యోగులున్నారు. ఇందులో వీసాలపై ఉన్న వారు 35శాతం మంది ఉన్నారు.

*హెచ్.సీ.ఎల్ లో అమెరికాలో 22855మంది ఉద్యోగులు ఉన్నారు. వీసాలపై ఉన్న వారు 35శాతం మంది ఉన్నారు.
Tags:    

Similar News